ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు నక్సలైట్లు హతం..
ఛత్తీస్ గఢ్ లో నక్సలైట్లు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. కాంకేర్ జిల్లాలోని కోయలిబేడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో శనివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. కోయలిబేడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం సమయంలో రాష్ట్ర పోలీసు దళానికి చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కు బయలుదేరింది.
కాలేజీ ఫెస్ట్ లో ‘జై శ్రీరామ్’ నినాదాలు.. వేదిక నుంచి దిగిపోవాలని ప్రొఫెసర్ హుకుం.. వీడియో వైరల్
ఈ క్రమంలో నక్సలైట్లు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. కాల్పుల అనంతరం ఇద్దరు పురుష నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక 12 బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్రాజ్ ‘పీటీఐ’తో తెలిపారు.
నా పెళ్లాం నుంచి కాపాడండి మహాప్రభో.. తలకు కట్టుతో, శోకాలు పెడుతూ పోలీసులను ఆశ్రయించిన యువకుడు..
ఇదే రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో గత నెల 5వ తేదీన ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో తలపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉన్న ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్మెట్ల, దులేద్ గ్రామాల మధ్య అడవిలో ఉదయం 6 గంటల సమయంలో వివిధ భద్రతా దళాలకు చెందిన జాయింట్ టీమ్ నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరింది. అయితే ఈ సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి.
ఐమాక్స్ లో అర్థరాత్రి గందరగోళం.. టికెట్ డబ్బులు ఇచ్చేయాలంటూ ప్రేక్షకుల ఆందోళన.. ఏం జరిగిందంటే ?
తాడ్మెట్ల-దులేద్ గ్రామాల అడవుల్లో మావోయిస్టుల జాగర్గుండ ఏరియా కమిటీకి చెందిన 10-12 మంది సాయుధ కేడర్లు ఉన్నారన్న పక్కా సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 223వ బెటాలియన్ కు చెందిన భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టే సమయంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలతో పాటు 12 బోర్ల డబుల్ బ్యారెల్ రైఫిల్, ఒక పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరణించిన నక్సలైట్లను మావోయిస్టుల జాగర్గుండ ఏరియా కమిటీలో క్రియాశీలకంగా ఉన్న మిలీషియా కార్యకర్తలు సోధి దేవా, రవా దేవలుగా గుర్తించారు.