Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్ షోపియాన్‌లో ఎన్ కౌంటర్.. జైషే ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఇది షోపియాన్‌ లో చోటు చేసుకుంది. మృతుడు జైషే మహ్మద్ (జేఇఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. 

Encounter in Jammu Kashmir Shopian.. Jaish terrorist killed..
Author
First Published Nov 11, 2022, 8:49 AM IST

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ (జేఇఎం) ఉగ్రవాద సంస్థ సభ్యుడు హతం అయ్యాడు. హతమైన తీవ్రవాది కుల్గామ్-షోపియాన్ ప్రాంతంలో చురుగ్గా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న కమ్రాన్ భాయ్ అలియాస్ హనీస్ గా గుర్తించినట్టు కాశ్మీర్ ఏడీజీపీ తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

తన పెళ్లికాకుండా మంత్రగత్తెలా అడ్డుపడుతోందని.. తల్లిని చంపిన తనయుడు

షోపియాన్ లోని కాప్రాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యానికి చెందిన విభాగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గత నెల 31వ తేదీన దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, అవంతిపోరా జిల్లాల్లో జరిగిన జాయింట్ యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు, పోలీసులు మట్టుబెట్టాయి. దీంతో పాటు శ్రీనగర్‌లో పోలీసులు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అవంతిపోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు, బిజ్‌బెహరా ప్రాంతంలో ఒక ఉగ్రవాది హతం అయ్యారని పోలీసులు తెలిపారు.

వింత పెళ్లి.. దివ్యాంగురాలైన కుమార్తెను భగవాన్ శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం...

వివరాల ఇలా ఉన్నాయి. అనంత్‌నాగ్‌లోని సేమ్‌థాన్ బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో ఆర్మీ (3వ ఆర్ ఆర్)తో పాటు పోలీసులు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. భద్రతా బలగాలు అనుమానాస్పద ప్రదేశం వైపు వెళుతుండగా.. దాక్కున్న ఉగ్రవాది జాయింట్ సెర్చ్ పార్టీపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీనికి  భద్రతా బలగాలు ధీటుగా బదులిచ్చాయి. వారి చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతీకారం తీర్చుకున్నాయి.

కేరళలో.. డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తొలగింపు..

ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో లాడర్‌ముడ్‌లో నివాసం ఉంటున్న హబీబుల్లా కుమారుడు షకీర్ అహ్మద్ అనే స్థానిక ఉగ్రవాది హతమయ్యాడు. పోలీసు రికార్డుల ప్రకారం హతమైన ఉగ్రవాదికి నిషేధిత ఉగ్రవాద సంస్థ హెచ్‌ఎంతో సంబంధాలు ఉన్నాయి. అతడు భద్రతా బలగాలపై దాడులతో పాటు అనేక ఉగ్రవాద నేర కేసుల్లో పాల్గొన్నారు. ఈ ఎన్ కౌటర్ పై కాశ్మీర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అవంతిపోరాలో హతమైన ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరు లష్కరో తోయిబా కు చెందిన కమాండర్ ముఖ్తార్ భట్ ఉన్నారని తెలిపారు. అతడు విదేశీ టెర్రరిస్ట్‌తో కలిసి భద్రతా దళాల శిబిరంపై ఫిదాయీన్ దాడికి వెళ్లేందుకు ప్లాన్ చేశారని చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే-74, రైఫిల్, ఒక ఏకే-56 రైఫిల్, 1 పిస్టల్ స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios