Asianet News TeluguAsianet News Telugu

వింత పెళ్లి.. దివ్యాంగురాలైన కుమార్తెను భగవాన్ శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం...

శ్రీకృష్ణుడే వరుడు.. తన దివ్యాంగురాలైన కూతురి వివాహం కృష్ణపరమాత్మతో నిర్వహించాడో వ్యాపారి. అదేదో తూతూ మంత్రంలా కాకుండా.. అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో చేశాడు. 

Lord Krishna brings procession to marry disabled girl in Gwalior,  MadhyaPradesh
Author
First Published Nov 11, 2022, 8:01 AM IST

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ వివాహం జరిగింది. శివపాల్ అనే వ్యాపారవేత్త తన దివ్యాంగురాలైన కుమార్తెను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. 21యేళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆ యువతి మాట్లాడలేదు, చెవులు కూడా వినపడవు. దీంతో ఆమెకు వివాహం కావడం కష్టంగా మారింది. కుమార్తెను సంతోషపెట్టడానికి శివపాల్ శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాడు. 

బంధువులందరికీ ఫోన్లు చేసి తన కుమార్తె పెళ్లి ఉందని ఆహ్వానించారు. శ్రీకృష్ణుడితో వివాహం జరిపిస్తున్నారని తెలిసిన వారు ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లిని శివపాల్ చాలా ఘనంగా నిర్వమించారు. మెహందీ, విందు, ఊరేగింపు సైతం నిర్వహించాడు. గుడిలో నిర్వహించిన ఈ వేడుకలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఓ యువతి, వధువు పూలదండలు మార్చుకోగా బంధుమిత్రులు ఆశీర్వదించారు. 

వధువు మీద ఉమ్మడం, వరుడి కాళ్లు కట్టేసి కొట్టడం.. వింత పెళ్లిళ్లు, విచిత్ర సంప్రదాయాలు... ఎక్కడంటే..

ఇదిలా ఉంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఓ వింత పెళ్లి జరిగింది. కలియుగదైవం శ్రీనివాసుడు, పద్మావతిల పెళ్లి కథ మీకు తెలుసు కదా.. అచ్చం అలాంటి వేషధారణలోనే ఓ పెళ్లి జరిగింది. వధువు, వరుడు, వారి బంధువులు అందరూ పౌరాణిక వేషధారణల్లో ఉండి ఈ పెళ్లిని నిర్వహించారు. 

వివరాల్లోకి వెడితే.. ఆంద్రప్రధేశ్లోని తణుకు దగ్గరున్న ఖండవల్లిలో ఈ వింత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గ్రామానికి చెందిన  శ్రీధర స్వామి అనే ఒక స్వామీజీకి తన కుమార్తె పెళ్లి గుర్తుండిపోయేలా చేయాలని ఆలోచన వచ్చింది. దీంతో ఈ  వింత పెళ్లికి శ్రీకారం కుదిరింది.

ఫెళ్లికొడుకు శ్రీనివాసుడిగా, పెళ్లి కూతురు పద్మావతి దేవి అలంకరణలో పెళ్లి పీటలపై కూర్చుని ఒక్కటయ్యారు. పెళ్లికి హాజరై ఇది చూసినవారు నిజంగా దేవతల పెళ్లి జరుగుతుందా అన్న ఆశ్చర్యానికి గురయ్యారు. వధూవరులే కాదు, పెళ్లి పెద్దలు కూడా ఇదే పౌరాణిక అలంకరణలోనే కనిపించారు. అలాగే పెళ్లి జరిపించారు. కలియుగంలో ఈ సమయంలో భువిపై దేవతల పెళ్లి జరుగుతుందా?? అన్నంత అంగరంగవైభవంగా ఈ పెళ్లి జరిగింది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios