Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. అనంతనాగ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. అనంతనాగ్ జిల్లా బిజ్‌బెహరాలోని చెకీ డూడూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేరకు భద్రత బలగాలు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపాయి. 

Encounter in Jammu and Kashmir..Firing between security forces and terrorists in Anantnag..
Author
First Published Nov 20, 2022, 10:27 AM IST

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ కాల్పులు ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమయ్యాయి.

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదుల నుంచి కాల్పులు జరగడంతో బలగాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. కాగా.. లోయలో లక్షిత హత్యల నేపథ్యంలో భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులపై చర్యలు చేపట్టాయి.

కదులుతున్న ఆటోలో పేలుడు..ఇద్దరికి తీవ్ర గాయాలు.. కర్ణాటకలో ఘటన

‘‘అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహరాలోని చెకీ డూడూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, సైన్యం కాల్పులు జరుపుతున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాం’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్ లో శనివారం భారత భద్రతాలు, పాక్ చొరబాటుదారులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. భారత సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చగా.. మిగిలిన వారు భయంతో వెనుదిరిగారు. భారత భద్రతా బలగాల అప్రమత్తమై.. చొరబాటుదారుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. భద్రతా బలగాల తరపున ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించారు.కానీ.. లొంగిపోకపోవడంతో భారత సైనికులు కాల్పులు జరిపారు. ఇందులో ఓ పాక్ ఉగ్రవాది హతమయ్యాడు.   

Follow Us:
Download App:
  • android
  • ios