ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మవోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్ష్నే వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో వెల్లడించారు. జిల్లాలోని మిరటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్రా గ్రామ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంట్ జరిగిందని వెల్లడించారు.

హిందీ భాషను మాపై రుద్దవద్దని నిరసిస్తూ 85 ఏళ్ల రైతు ఆత్మహత్య.. డీఎంకే ఆఫీసు ఎదుటే ఒంటికి నిప్పు

పొమారా గ్రామ అడవుల్లో నక్సల్‌ డివిజనల్‌ కమిటీ సభ్యులు మోహన్‌ కడ్టీ, సుమిత్ర, మట్వారా ఎల్‌వోఎస్‌ కమాండర్‌ రమేష్‌తో పాటు దాదాపు 40 మంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. దీంతో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ల సంయుక్త బృందాన్నిపెట్రోలింగ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.

Scroll to load tweet…

ఈరోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు పొమ్రా గ్రామ అటవీ ప్రాంతానికి చేరుకోగానే నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారని, దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని ఆయన చెప్పారు. కొద్దిసేపు ఎదురుకాల్పులు జరగడంతో నక్సల్స్ అక్కడి నుంచి పారిపోయారని అధికారులు తెలిపారు. అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిని పరిశీలించగా.. అక్కడ నుంచి ముగ్గురు నక్సల్స్ మృతదేహాలు లభ్యమయ్యాయని అన్నారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా మరో మృతదేహం కనిపించిందని అన్నారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని చెప్పారు. హతమైన మావోయిస్టులను ఇంకా గుర్తించలేదని తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని, ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని ఎస్పీ చెప్పారు. 

సిసోడియాకు సీబీఐ,మోడీ క్లీన్ చిట్.. లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజాపూర్ జిల్లాలోని పోలీసు శిబిరంపై నక్సల్స్ కాల్పులు జరపడంతో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని జైగూర్ క్యాంపులో ఈ ఘటన జరిగింది. గాయపడిన నలుగురిలో ముగ్గురు బీజాపూర్ పోలీసు దళానికి చెందిన వారు కాగా.. మిగిలిన ఒకరు ఛత్తీస్‌గఢ్ సాయుధ దళానికి చెందిన వారు ఉన్నారు.

అదర్ పూనావాలా అని నమ్మించి ‘సీరం’ నుంచి కోటి రూపాయాల మోసం.. ఎలాగంటే?

బీజాపూర్ జిల్లాలోని మిర్టూర్ పోలీస్ స్టేషన్‌ విధులు నిర్వహిస్తున్న ఒక అసిస్టెంట్ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ ప్రాంతంలో నిర్వహించిన వారాంతపు సంతలో నక్సల్ చేతిలి హతమయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్ హై-ప్రెజర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుళ్ల దాడికి పాల్పడ్డారు. ఇందులో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి మరణించారు.