జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించడానికి వెళ్లిన భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఇది ఇన్ కౌంటర్ కు దారి తీసింది.

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్ జ‌రిగింది. జిల్లాలోని వనిగం బాలా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు ట్విట్ట‌ర్ లో పోస్ట్ పెట్టారు. 

మన దేశంలో మహిళా న్యాయవాదులు కేవలం 15 శాతమే: పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం

“ బారాముల్లా జిల్లాలోని వనిగం బాలా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు పనిలో ఉన్నాయి. మరిన్ని వివరాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం’’ అని ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

దీనికి సంబంధించి ప్ర‌స్తుతం వ‌ర‌కు ఉన్న నివేదిక ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని క్రీరి ప్రాంతంలోని వనిగం బాలాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అంద‌టంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించాయి. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అది ఎన్‌కౌంటర్‌గా మారింది. వారు ప్ర‌తీకారం తీర్చుకున్నార‌ని ఓ అధికారి తెలిపారు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వైపులా ఎలాంటి ప్రాణ న‌ష్ట‌మూ జ‌రిగిన‌ట్టు నివేదిక‌లు వెలువ‌డలేదు. 

కర్ణాటకలో ప్రేత వివాహం.. మరణించిన 30 ఏళ్లకు పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు.. వివరాలివే

ఇదిలా ఉండ‌గా.. గత నెల చివ‌రిలో కూడా జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. నౌపోరా మీర్ బజార్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుపెట్టాయి. హతమైన ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కి చెందినవారని పోలీసులు తెలిపారు. నవాపోరాలో ఉగ్రవాదులు ఉన్నారని విశ్వ‌స‌నీయ సమాచారం భద్రతా బలగాల‌కు అందింది. దీంతో అప్ర‌మ‌త్తమైన భ‌ద్ర‌త బ‌ల‌గాలు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వ‌హించారు. సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని, ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారి తెలిపారు.