ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమీషన్ షాకిచ్చింది. ఆయన ట్విట్టర్‌ ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియోపై కమీషన్ మండిపడింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడమేనని దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసు జారీ చేసింది.

ఆ వీడియో మోడల్ కోడ్, ఆర్పీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఓట్లు సాధించడం కోసం కుల, మత భావాలను రెచ్చగొట్టడంతో పాటు మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉందని ఈసీ అభిప్రాయపడింది. 

Also Read:డిప్యూటీ సీఎం సిసోడియా ఒఎస్డీని అరెస్టు చేసిన సీబీఐ

కాగా.. ఢిల్లీ శానససభ ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) గోపాల్ కృష్ణ మాధవ్ ను సీబీఐ అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. లంచం తీసుకున్నాడనే ఆరోపణపై సిబీఐ అతన్ని అదుపులోకి తీసుకుంది. 

అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అయయిన గోపాల్ కృష్ణ మాధవ్ సిసోడియా వద్ద ఓఎస్టీగా పనిచేస్తున్నారు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత వ్యవహారంలో సీబీఐ వల పన్ని అతన్ని అరెస్టు చేసింది.

Also Read:జామియా కాల్పులు : కేజ్రీవాల్ తలుచుకుంటే ఆగిపోతాయి..జి. కిషన్ రెడ్డి కామెంట్స్.

విచారణ నిమిత్తం అతన్ని సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారంలో సిసోడియా పాత్ర లేదని తేలింది. మాధవ్ సిసోడియా ఓఎస్డీగా 2015లో నియమితులయ్యారు. 

ఇదిలావుంటే, జామియా మిలియా ఇస్లామియాలో డిసెంబర్ నెలలో హింస చెలరేగిన సందర్భంలో రావాణా బస్సులకు నిప్పు పెట్టారనే ఆరోపణపై ఢిల్లీ పోలీసులు సిసోడియాపై క్రిమినల్ ఫిర్యాదును నమోదు చేశారు.