న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) గోపాల్ కృష్ణ మాధవ్ ను సీబీఐ అరెస్టు చేసింది. లంచం తీసుకున్నాడనే ఆరోపణపై సిబీఐ అతన్ని అరెస్టు చేసింది.

అండమాన్ నికోబార్ దీవుల సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అయయిన గోపాల్ కృష్ణ మాధవ్ సిసోడియా వద్ద ఓఎస్టీగా పనిచేస్తున్నారు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత వ్యవహారంలో సీబీఐ వల పన్ని అతన్ని అరెస్టు చేసలింది.

విచారణ నిమిత్తం అతన్ని సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారంలో సిసోడియా పాత్ర లేదని తేలింది. మాధవ్ సిసోడియా ఓఎస్డీగా 2015లో నియమితులయ్యారు. 

ఇదిలావుంటే, జామియా మిలియా ఇస్లామియాలో డిసెంబర్ నెలలో హింస చెలరేగిన సందర్భంలో రావాణా బస్సులకు నిప్పు పెట్టారనే ఆరోపణపై ఢిల్లీ పోలీసులు సిసోడియాపై క్రిమినల్ ఫిర్యాదును నమోదు చేశారు.