రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న రాహుల్ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమీషన్ సీరియస్ అయ్యింది.
KNOW
Election Commission of India : కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఈసి అధికారులు వ్యవహరించారని రాహుల్ ఆరోపించారు. ఇందుకు తమవద్ద అణుబాంబులాంటి ఆధారాలున్నాయని… వాటిని బయట పెడతామని రాహుల్ హెచ్చరించారు. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడానికి ఈసిని వాడుకుందన్నది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ.
అయితే రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసి సీరియస్ అయ్యింది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు కోరినట్లు డిక్లరేషన్ పై సంతకం చేయాలని… లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని రాహుల్ ను ఈసి కోరుతోంది. ఎన్నికల సంఘంపై తన ఆరోపణలు నిజమని రాహుల్ నమ్మితే డిక్లరేషన్ పై సంతకం చేయడంలో ఎలాంటి సమస్య ఉండకూడదని ఎన్నికల సంఘం వర్గాలు అంటున్నాయి. రాహుల్ గాంధీ అఫిడవిట్‌లపై సంతకం చేయకపోతే క్షమాపణ చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది.
రాహుల్ గాంధీ ముందు రెండు ఆప్షన్స్
"రాహుల్ గాంధీ ప్రకటనపై సంతకం చేయకపోతే తన విశ్లేషణను నమ్మడంలేదని స్పష్టమవుతుంది… అసంబద్ధ ఆరోపణలు చేశాడని తేలిపోతుంది. ఈ సందర్భంలో అతను దేశానికి క్షమాపణ చెప్పాలి. అతనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి… ప్రకటనపై సంతకం చేయడం లేదా ఎన్నికల సంఘంపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పండి" అని ఈసి వర్గాలు తెలిపాయి.
కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో బిజెపి గెలుపు కోసం 1,00,250 "నకిలీ ఓట్లు" నమోదుచేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి (CEO) దీనిపై రియాక్ట్ అయ్యారు…రాహుల్ చెప్పింది నిజమైతే అఫిడవిట్‌పై సంతకం చేయాలని ఆయన కోరారు.
"పత్రికా సమావేశంలో మీరు 3వ పేరాలో పేర్కొన్న ఓటర్ల జాబితాలో అనర్హ ఓటర్ల చేరిక, అర్హత కలిగిన ఓటర్ల మినహాయింపు గురించి ప్రస్తావించారు. ఓటర్ల నమోదు నియమాలు 1960, 20(3)(b) ప్రకారం అటువంటి ఓటర్లు, పేర్లతో కూడిన ఆధారాలపై సంతకం చేసి తిరిగి ఇవ్వాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.. తద్వారా అవసరమైన చర్యలు ప్రారంభించవచ్చు..." అని ఎన్నికల అధికారికి రాహుల్ కు లేఖ రాశారు.
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ప్రమాణ పత్రం సమర్పించి నిర్దిష్ట ఆధారాలు అందించాలని మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) కూడా కోరారు. ఓటర్ల జాబితాలను "పారదర్శకంగా తయారు చేశామని" CEO పునరుద్ఘాటించారు.. డ్రాఫ్ట్, తుది ఓటర్ల జాబితాలను ఆగస్టు, సెప్టెంబర్ 2024లో కాంగ్రెస్‌తో పంచుకున్నట్లు గుర్తుచేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అప్పీళ్లను దాఖలు చేయలేదు అని సీఈవో పేర్కొన్నారు.
