శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు మరో నాలుగు రోజుల పాటు ఈడీ కష్టడీలోనే ఉండనున్నారు. ఈ మేరకు ఈడీ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. 

మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని ముంబైలోని స్పెషల్ కోర్టు ఆగస్టు 8వ తేదీ వ‌ర‌కు పొడ‌గించింది. ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ ఈడీ దర్యాప్తులో అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలిపింది. 

75th independence day: ఉగ్రవాదులు విరుచుకుపడొచ్చు... ఢిల్లీ పోలీసులకు ఐబీ హెచ్చరికలు

సబర్బన్ గోరెగావ్‌లోని పత్రా చాల్ రీడెవలప్‌మెంట్‌లో ఆర్థిక అవకతవకలు, అతడి భార్య, ఇత‌ర స‌హ‌చ‌రుల‌పై ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆదివారం అర్ధ‌రాత్రి సంజ‌య్ రౌత్ ను ఈడీ అరెస్టు చేసింది. అనంత‌రం అధికారులు ఆయ‌న‌ను కోర్టుకు తీసుకెళ్ల‌గా ఆగ‌స్టు 4వ తేదీ (గురువారం) వ‌ర‌కు ఈడీ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. 

అతడి ప్రాథమిక రిమాండ్ ముగింపులో దర్యాప్తు సంస్థ రౌత్‌ను ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టు న్యాయమూర్తి MG దేశ్‌పాండే ఎదుట హాజరుపరిచింది. ఈ వ్యవహారంలో మ‌రింత విచార‌ణ జ‌రిపేందుకు సంజ‌య్ రౌత్ క‌స్ట‌డీని మ‌రింత పొడ‌గించాల‌ని ఈడీ కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆగస్టు 8 వరకు కస్టడీని పొడిగించింది. హౌసింగ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకల వల్ల రౌత్, అతడి కుటుంబం కోటి రూపాయలకు పైగా ‘నేరపు ఆదాయాలు’ పొందినట్లు ED గతంలో కోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, మరో ఇద్దరికి చెందిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

Go First Flight: గో ఫస్ట్ విమానానికి త‌ప్పిన పెను ప్ర‌మాదం.. పక్షి ఢీ కొట్టడంతో దారి మ‌ళ్లింపు..

శివ‌సేన సీనియ‌ర్ నాయ‌కుడైన 60 ఏళ్ల సంజ‌య్ రౌత్ ఆ పార్టీ అధ్య‌క్షుడు ఉద్ద‌వ్ ఠాక్రేకు సన్నిహితుడు. ఆయ‌న అదే పార్టీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఎంవీఏ ప్ర‌భుత్వానికి అండ‌గా ఉన్నారు. పార్ల‌మెంట్ లో శివ‌సేన వాయిస్ ను గ‌ట్టిగా వినిపించేవారు. ఇటీవ‌ల ఉద్ద‌వ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండే వ‌ర్గంపై కూడా ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌కు కూడా షిండే వ‌ర్గంతో క‌ల‌వాల‌ని ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, కానీ తాను అందులో చేర‌లేద‌ని తెలిపారు. 

మోదీకి భయపడే ప్రసక్తే లేదు.. నా పనిని నేను కొసాగిస్తాను: రాహుల్ గాంధీ

తాజా ఈడీ కేసుల నేప‌థ్యంలో ఆయ‌న స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం ఆరోపించారు. ఈడీ ద్వారా త‌న‌పై ఎంత ఒత్తిడి తెచ్చినా తాను మాత్రం ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి నడుస్తానని చెప్పారు. మహారాష్ట్ర, శివసేన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాయ‌ని అన్నారు. ఇవి త‌ప్పుడు చ‌ర్య‌ల‌ని అన్నారు. తాను శివ‌సేన‌ను వీడ‌బోన‌ని, చ‌నిపోయినా లొంగిపోన‌ని అన్నారు. త‌న‌కు ఎలాంటి స్కామ్‌లతోనూ సంబంధం లేద‌ని అన్నారు. త‌మ‌కు బాలాసాహెబ్ పోరాటాన్ని నేర్పించార‌ని, శివ‌సేన కోసం పోరాడుతూనే ఉంటాన‌ని సంజ‌య్ రౌత్ చెప్పారు.