MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !

Space War: పాకిస్థాన్ చైనా సాయంతో కేవలం 16 నెలల్లో 6 నిఘా ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ సరిహద్దులపై నిరంతర నిఘా పెంచుతోంది. ఇది భారత భద్రతకు సవాలుగా మారింది. పాకిస్థాన్ ఏం ప్లాన్ చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 10 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాకిస్థాన్ అంతరిక్ష గూఢచర్యం: 16 నెలల్లో 6 శాటిలైట్లు
Image Credit : Getty

పాకిస్థాన్ అంతరిక్ష గూఢచర్యం: 16 నెలల్లో 6 శాటిలైట్లు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఆ పోరు నింగిలోకి కూడా పాకింది. గత 16 నెలల కాలంలో పాకిస్థాన్ అనూహ్య వేగంతో అంతరిక్షంలో మరో కుట్రకు తెరలేపింది. కేవలం 16 నెలల్లోనే ఏకంగా ఆరు భూ-పరిశీలన (Earth-observation) ఉపగ్రహాలను పాక్ ప్రయోగించింది. దీని వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉపగ్రహాల ప్రధాన లక్ష్యం భారత భూభాగంపై, ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాలపై కన్నేసి ఉంచడమేనని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య పరిస్థితులు శాంతించినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక పాకిస్థాన్ తన గూఢచారి వ్యవస్థను అంతరిక్షం ద్వారా బలోపేతం చేసుకుంటోంది. జనవరి 2025 నుండి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో పాక్ ప్రయోగించిన ఈ శాటిలైట్లు ఇప్పుడు భారత్‌కు కొత్త తలనొప్పిగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
60 ఏళ్ల చరిత్రలో లేని వేగం.. 16 నెలల్లోనే సాధ్యం
Image Credit : Asianet News

60 ఏళ్ల చరిత్రలో లేని వేగం.. 16 నెలల్లోనే సాధ్యం

పాకిస్థాన్ స్పేస్ ఏజెన్సీ ‘సుపార్కో’ (SUPARCO) 1961లో ప్రారంభమైంది. అంటే మన ఇస్రో కంటే ముందే ఇది ఏర్పాటైనా, దశాబ్దాల పాటు దీని ప్రగతి చాలా నెమ్మదిగా సాగింది. గత కొన్ని దశాబ్దాల్లో పాక్ ప్రయోగించిన శాటిలైట్లు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కేవలం 16 నెలల వ్యవధిలోనే ఆరు హై టెక్ శాటిలైట్లను నింగిలోకి పంపడం చూస్తుంటే, పాక్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తోందో అర్థమవుతుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజింగ్, హైపర్ స్పెక్ట్రల్, రిమోట్ సెన్సింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు ఉన్నాయి.

36
చైనా బ్యాక్ ఎండ్ సపోర్ట్.. గేమ్ ప్లాన్ ఇదేనా?
Image Credit : Getty

చైనా బ్యాక్ ఎండ్ సపోర్ట్.. గేమ్ ప్లాన్ ఇదేనా?

పాకిస్థాన్ సొంతంగా ఈ ఘనత సాధించడం అసాధ్యం. దీని వెనుక చైనా పూర్తి సహకారం ఉంది. చాలా శాటిలైట్లను చైనా రాకెట్ల ద్వారానే ప్రయోగించారు. కేవలం రాకెట్లే కాకుండా, శాటిలైట్ డిజైన్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, డేటా షేరింగ్‌లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. చైనాకు చెందిన ‘యావోగాన్, గావోఫెన్’ శాటిలైట్ నెట్‌వర్క్‌తో ఈ పాక్ శాటిలైట్లు అనుసంధానమైతే, భారత్ కదలికలను సెకన్ల వ్యవధిలో పసిగట్టే ప్రమాదం ఉంది. అంటే పాకిస్థాన్ కళ్లు ఇప్పుడు అంతరిక్షంలో చైనా పవర్‌తో పనిచేస్తున్నాయనే హెచ్చరికలు ఆందోళన కలిగించే విషయం.

46
భారత్ టార్గెట్‌గా ‘PRSC-EO3’ కక్ష్య
Image Credit : ChatGPT

భారత్ టార్గెట్‌గా ‘PRSC-EO3’ కక్ష్య

ఏప్రిల్ 2026లో ప్రయోగించిన PRSC-EO3 శాటిలైట్ గురించి షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. అమెరికాకు చెందిన స్పేస్ అనాలిసిస్ సంస్థ ‘COMSPOC’ విశ్లేషణ ప్రకారం, ఈ శాటిలైట్ కక్ష్యను ప్రపంచం మొత్తం చూడటానికి కాకుండా, కేవలం దక్షిణాసియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేశారు. దీనివల్ల పాకిస్థాన్, ఉత్తర భారత్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను రోజుకు అనేకసార్లు ఈ శాటిలైట్ స్కాన్ చేస్తుంది. దీంతో సైనిక మోహరింపులు, బంకర్లు, కొత్తగా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల వివరాలన్నీ పాక్ చేతికి చిక్కే అవకాశం ఉంది.

56
మారువేషంలో ఉన్న వస్తువులను కూడా పట్టేస్తాయి
Image Credit : our own

మారువేషంలో ఉన్న వస్తువులను కూడా పట్టేస్తాయి

పాక్ ప్రయోగించిన ‘HS-1’ వంటి హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్లు అత్యంత ప్రమాదకరమైనవి. సాధారణ కెమెరాలకు చిక్కని వస్తువులను కూడా ఇవి గుర్తించగలవు. ఉదాహరణకు, అడవుల్లో లేదా కొండల్లో మారువేషంలో దాచిన ఆయుధాలను, ట్యాంకులను ఇవి ఈజీగా కనిపెడతాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే PRSC-EO2 వంటి శాటిలైట్లు ఏఐ సాయంతో డేటాను ప్రాసెస్ చేస్తాయి. అంటే భూమి మీద ఏ చిన్న మార్పు జరిగినా వెంటనే అలర్ట్ పంపిస్తాయి. ఇది మన సరిహద్దు భద్రతకు పెద్ద సవాలు.

66
ఇస్రో, భారత్ ముందున్న సవాళ్లు
Image Credit : Pinterest

ఇస్రో, భారత్ ముందున్న సవాళ్లు

అంతరిక్ష రంగంలో భారత్ పాకిస్థాన్ కంటే ఎంతో ముందున్న మాట వాస్తవమే. అయితే, గత రెండేళ్లలో ఇస్రో కొన్ని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంది. కొన్ని కీలకమైన ఎర్త్ అబ్జర్వేషన్, నావిగేషన్ మిషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇదే సమయంలో పాక్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడం రక్షణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

భవిష్యత్తులో యుద్ధాలు కేవలం భూమి మీద మాత్రమే కాదు, అంతరిక్షం నుండి వచ్చే సమాచారం ఆధారంగానే జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ ‘స్పేస్ గూఢచర్యాన్ని’ అడ్డుకోవడానికి భారత్ తన స్పేస్ డిఫెన్స్ సిస్టమ్‌ను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పాకిస్తాన్
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Related Stories
Recommended image1
FIFA World Cup 2026 Prize Money: గెలవకుండా ఇంటికెళ్లే టీమ్‌కు రూ. 100 కోట్లా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Recommended image2
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved