Asianet News TeluguAsianet News Telugu

మోదీకి భయపడే ప్రసక్తే లేదు.. నా పనిని నేను కొసాగిస్తాను: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు గుప్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి తనను, ఇతర విపక్షాల గొంతులను నిశ్శబ్దం చేయడానికి ఒత్తిడి వ్యుహాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యతో తాను నరేంద్ర మోదీకి భయపడనని, భయపడబోనని చెప్పారు.

Not afraid of Narendra Modi says Rahul Gandhi
Author
First Published Aug 4, 2022, 3:15 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు గుప్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి తనను, ఇతర విపక్షాల గొంతులను నిశ్శబ్దం చేయడానికి ఒత్తిడి వ్యుహాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యతో తాను నరేంద్ర మోదీకి భయపడనని, భయపడబోనని చెప్పారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలోని యంగ్ ఇండియన్ ప్రాంగణాన్ని ED తాత్కాలికంగా సీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఒక్కరోజు తర్వాత రాహుల్ గాంధీ నుంచి ఈ విధమైన రియాక్షన్ వచ్చింది. ‘‘నేషనల్ హెరాల్డ్ గురించి మాట్లాడితే మొత్తం బెదిరింపులే.. కొంచెం ఒత్తిడి తెచ్చి మనల్ని మౌనంగా ఉంచగలమని వారు అనుకుంటున్నారు.. మేము మౌనంగా ఉండం. బీజేపీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తున్నదానికి వ్యతిరేకంగా మేము నిలబడతాం. మేము భయపడే ప్రసక్తే లేదు’’ అని రాహుల్ గాందీ అన్నారు. 

“వారు(బీజేపీ)  ఏది కావాలంటే అది చేయవచ్చు. దాన్ని పట్టించుకోవక్కర్లేదు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, దేశంలో సామరస్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తాను. వారు ఏమి చేసినా నేను నా పనిని కొనసాగిస్తాను’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే.. ‘‘సత్యాన్ని దాచలేం. మీరు ఏమైనా చేయండి. నేను ప్రధానికి భయపడను, నేను ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాల కోసం పని చేస్తాను. వినండి.. అర్థం చేసుకోండి!’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

 

ఇక, రాహుల్ గాంధీ పార్లమెంట్‌ సెంట్రల్ హాల్‌లో పలువురు ఎంపీలతో ముచ్చటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఇక, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు దాదాపు 50 గంటల పాటు ప్రశ్నించింది. అలాగే ఆయన తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఈడీ ప్రశ్నించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios