ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మరో బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది.

Also Read:కరోనా వైరస్ ఎఫెక్ట్: చైనాలోనే 250 మంది ఇండియన్ స్టూడెంట్స్

వీరిద్దరిని ఢిల్లీ ఎన్నికల ప్రచార జాబితాలోంచి తొలగించాల్సిందిగా భారతీయ జనతా పార్టీని ఈసీ ఆదేశించింది. తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకు వీరిద్దరు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.

ఢిల్లీలోని రితాలా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్షాలను దేశద్రోహులు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా వారిపై తూటాలు పేల్చాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.

Also Read:ఆ రెస్టారెంట్ లో ఫుడ్ తింటే... అక్షరాలా రూ.లక్ష గిఫ్ట్

ఇక పర్వేశ్ విషయానికి వస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా షహీన్ బాగ్ ఆందోళనకారులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ నిరసన కారులు మీ ఇళ్లలోకి చొరబడి హత్యలు, అత్యాచారాలకు పాల్పడతారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.