ఏ రెస్టారెంట్ కి వెళ్లినా.. మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి... కడుపు నిండా తినేస్తాం. ఆ తర్వాత బిల్లు కట్టి బయటకు వస్తాం. అసలు ఏ రెస్టారెంట్ కి వెళ్లినా.. మన జేబుకి చిల్లు పడటం ఖాయం.  అయితే.... ఈ రెస్టారెంట్ లో మాత్రం ఫుడ్ తింటే చాలు వాళ్లే మనకు రూ.లక్ష చేతిలో పెట్టి మరీ సాగనంపుతారు. ఈ ఆఫర్ భలే ఉందే అనుకునేరు. ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది.

ఆ మెలికేంటో తెలుసా...? కంచెంలో వాడు పెట్టిన భోజనమంతా మెతుకు కూడా వదలకుండా తినేయాలి. ఇది కనుక మీరు ఫాలో అయితే... మీ చేతికి రూ.లక్ష అందుతుంది. ఈ రెస్టారెంట్ గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ రెస్టారెంట్ లో బకాసుర  థాలి పేరిట ఓ రెస్టారెంట్  ని ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 55వంటకాలు ఉంటాయి. 12రకాల స్వీట్లు, 7రకాల సలాడ్లు, 15 రకాల రోటీను వడ్డిస్తారు. ఆ థాలిలో వడ్డించి ఫుడ్ ని కొంచెం కూడా మిగల్చకుండా తినాలి.

Also Read ప్రేమ పెళ్లి చేసుకున్నాడని... శోభనానికి ముందే కొడుకు పురుషాంగం కోసి.....

అలా కనుక తింటే ఆ కస్టమర్ కి రెస్టారెంట్ రూ.లక్ష బహుమతి ఇస్తుంది. అలాకాకుండా ఆ థాలి తినలేకపోతే... బిల్లు మాత్రం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో పాల్గొనేందుకు సూరత్ వాసులు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా, ఇలాంటి విచిత్రమైన ఫుడ్ పోటీ ఒకటి మంగళూరు రెస్టారెంట్ కూడా ప్రారంభించింది. 

56 రకాల వంటలతో, 10 రకాల డెసర్ట్‌లు, 4 డ్రింక్‌లు, 4 రకాల చట్నీలు, 5 రకాల చిత్రాన్నాలు, రోటీలు, పచ్చళ్ళు, 8 రకాల కూరలు వడ్డిస్తారు. కాగా, కస్టమర్లను ఆకర్షించడం కోసం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇప్పుడు అన్ని మెట్రోపాలిటన్ సిటీల రెస్టారెంట్లలో ఈ థాలీలను ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ బకాసుర థాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.