Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ ఎఫెక్ట్: చైనాలోనే 250 మంది ఇండియన్ స్టూడెంట్స్

చైనాలో చిక్కుకొన్న 250 మంది విద్యార్థులను ఇండియాకు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. 

Coronavirus: India 'requests' China to permit Indian student ..
Author
New Delhi, First Published Jan 29, 2020, 3:27 PM IST


న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగిపోయింది. చైనాలో ఉన్న తమ విద్యార్థులను వెంటనే ఇండియాకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వాన్ని ఇండియా కోరింది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పట్ల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరిన విషయం తెలిసిందే.

Also read:కరోనా వైరస్: హైద్రాబాద్‌లో కేంద్ర వైద్య బృందం పర్యటన

ఇండియాలోని తెలుగు రాష్ట్రాలకు చెందిన 250 మంది విద్యార్థులు వుహాన్ యూనివర్శిటీలో చదువుతున్నారు. చైనాలో కరోనా వైరస్ కారణంగా పలు యూనివర్శిటీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

అయితే వుహాన్ యూనివర్శిటీలో  తెలుగు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. తాము పడుతున్న ఇబ్బందుల గురించి విద్యార్థులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.అయితే తమ విద్యార్థులను  పంపాలని చైనా ప్రభుత్వాన్ని  ఇండియా కోరింది.  ఈ యూనివర్శిటీలో ఎక్కువ మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. 

వుహాన్ పట్టణంలో  11 మిలియన్ జనాభా నివసిస్తున్నారు. వీరిలో 1300 మందికి కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ బారినపడిన వారిలో  41 మంది మృతి చెందారు. అయితే చైనా కొత్త సంవత్సరానికి పురస్కరించుకొని చాలా యూనివర్శిటీలకు ఇంతకు ముందే సెలవులు ప్రకటించారు.

దీంతో చాలా మంది ఇండియాకు చెందిన విద్యార్థులు  చైనాను వదిలి వచ్చారు. అయితే అదే సమయంలో ఇంకా 200 నుండి 250 మంది విద్యార్థులు చైనాలో ఉన్నారని సమాచారం. ఈ నెల 23వ తేదీకి ముందే చైనా నుండి ఇండియాకు చెందిన విద్యార్థులు బయలుదేరారు. వుహాన్ నుండి వచ్చిన వారిని ఇండియాలో క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు.

చైనాలో ఇంకా ఉన్న ఇండియాకు చెందిన విద్యార్థులను వెంటనే తమ స్వగ్రామాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఇండియా చైనా విదేశాంగ శాఖను కోరింది. 
అయితే విదేశీయులను తమ ప్రాంతాలకు పంపేందుకు తాము అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నట్టుగా చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. 
చైనాలోనే ఉన్న తమవారిని వెంటనే రప్పించేందుకు ఇండియాలో ఉన్న వారి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios