earthquake : పశ్చిమబెంగాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత
పశ్చిమ బెంగాల్ లోని అలీపుర్దువార్ జిల్లాలో భూకంపం వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు.
earthquake : పశ్చిమ బెంగాల్ లో బుధవారం భూకంపం వచ్చింది. అలీపుర్దువార్ జిల్లాలో ఉదయం 10 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.6గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. భూకంప లోతు 14 కిలోమీటర్లుగా ఉందని ఎన్ సీఎస్ పేర్కొంది
జనాభా నియంత్రణపై బీహార్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడ్డ ప్రధాని మోడీ.. ఏమన్నారంటే ?
‘‘భారత కాలమానం ప్రకారం ఉదయం 10.51 గంటలకు భూకంపం సంభవించింది. అలీపుర్దువార్ లో 14 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ’’ అని ఎన్ఎసీఎస్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) పేజీలో ఉంది. కాగా.. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు.
కాగా.. మంగళ, బుధ వారాల్లో పంజాబ్ లోని రూప్ నగర్ లో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 1:13 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని, భూకంప లోతు 10 కిలోమీటర్ల దూరంలో ఉందని ఎన్ సీఎస్ ట్వీట్ చేసింది.