గుజరాత్ లోని కచ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.2గా నమోదు అయ్యింది. భచౌ నగరానికి ఉత్తర ఈశాన్యంగా 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ తెలిపింది. 

గుజరాత్ లోని కచ్ జిల్లాలో సోమవారం ఉదయం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్ఆర్) తెలిపింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కచ్ లో తేలికపాటి ప్రకంపనలు సంభవించడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి.

లండన్ లో ఖలిస్తానీ మద్దతుదారులకు చెంపపెట్టు.. దింపిన చోటే.. భారీ స్థాయిలో ఎగురుతున్న త్రివర్ణపతాకం..

తాజా ప్రకంపనలు సోమవారం ఉదయం 7:35 గంటలకు నమోదయ్యాయి. కచ్ జిల్లాలోని భచౌ నగరానికి ఉత్తర ఈశాన్యంగా 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఐఎస్ఆర్ తెలిపింది. 

అత్యంత ప్రమాదకర భూకంప ప్రాంతంలో ఉన్న కచ్ జిల్లాలో 2001లో సంభవించిన భూకంపంలో 13,800 మంది ప్రాణాలు కోల్పోయారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు. గత రెండు శతాబ్ధాలలో ఇది భారతదేశంలో మూడో అతిపెద్ద, రెండవ అత్యంత వినాశకరమైన భూకంపం. గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (జీఎస్డీఎంఎ) ప్రకారం.. గుజరాత్ అధిక భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001 లో ప్రధాన భూకంపాలను చూసింది. 

నంద్యాలలో తయారవుతున్న దక్షిణ భారత అతిపెద్ద హనుమాన్ విగ్రహం.. ఎక్కడ ప్రతిష్టిస్తారంటే?

కాగా.. అసోంలో కూడా ఈ నెల 8వ తేదీన భూకంపం సంభవించింది. కామరూప్ జిల్లాలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2గా నమోదు అయ్యింది. 8వ తేదీ తెల్లవారుజామున 3:59 గంటలకు ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. 

ర్యాప్ సాంగ్‌గా మారిన దీపికా పదుకొనే 'నాటు నాటు' ఆస్కార్ ప్రసంగం.. ఆమె రియాక్షన్ ఏంటంటే...

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.