Asianet News TeluguAsianet News Telugu

Jawad Cyclone: ‘జవాద్’ ఎఫెక్ట్.. రద్దైన పలు రైళ్లు.. వివరాలివే..

జ‌వాద్‌ తుపాను మ‌రింత బ‌ల‌ప‌డుతోంది.  దీంతో తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే శాఖ‌లు  అప్రమత్తమ‌య్యాయి. ఆదివారం నుంచి గురువారం వ‌ర‌కు పలు రైళ్లలను రద్దు చేస్తున్నట్లు రైల్వే వెల్లడించింది. డిసెంబర్ 5,6,7,8, 9 తేదీల్లో దాదాపు 30కి పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేసిన‌ట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె. త్రిపాఠి ఒక ప్రకటన జారీ చేశారు. 
 

Due to the impending cyclone Jawad the following trains are proposed for cancellation
Author
Hyderabad, First Published Dec 4, 2021, 8:38 PM IST

Jawad Cyclone: జ‌వాద్‌ తుపాను మ‌రింత విజృంభిస్తోంది.  బంగాళాఖాతంలోని అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి  120 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో జోవాద్‌ తుపాను కేంద్రీకృతమైన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ప్రస్తుతం తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్ర‌భావంతో ఉత్త‌రాంధ్ర‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

దీంతో తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వేలు అప్రమత్తం అయింది. ఆదివారం నుంచి గురువారం వ‌ర‌కు పలు రైళ్లలను రద్దు చేస్తున్నట్లు రైల్వే వెల్లడించింది.  డిసెంబర్ 5,6,7,8, 9 తేదీల్లో దాదాపు 30కి పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ఈ మేరకు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె. త్రిపాఠి ఒక ప్రకటన జారీ చేశారు. 

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/hurricane-jawad-looming-high-alert-in-ap-r3kzom

 జ‌వాద్‌ తుఫాను కారణంగా రద్దు చేయబడిన రైళ్లు..

05/12/2021న రద్దు చేయబడిన రైళ్లు..( ప్రారంభ స్టేషన్ల నుండి రద్దు చేయబడిన‌వి)   
 
1. రైలు నెం.12663 హౌరా-తిరుచిరాపల్లె  ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం.12845 భువనేశ్వర్- బెంగళూరు కాంట్ ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం.17015 భువనేశ్వర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
4. రైలు నెం.17479 పూరీ -తిరుపతి ఎక్స్‌ప్రెస్
5. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్
6. రైలు నెం. 18463 భువనేశ్వర్- KSR బెంగళూరు ఎక్స్‌ప్రెస్
7. రైలు నెం. 18531 పలాస-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
8. రైలు నెం.18552 కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
9. రైలు నెం. 20819 పూరి- ఓఖా ఎక్స్‌ప్రెస్
10. రైలు నెం. 20890 తిరుపతి-హౌరా ఎక్స్‌ప్రెస్
11. రైలు నెం. 22642 షాలిమార్-త్రివేంద్రం సెంట్రల్ ఎక్స్‌ప్రెస్
12. రైలు నెం. 22808 MGR చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్
13. రైలు నెం. 22818 మైసూర్-హౌరా ఎక్స్‌ప్రెస్
14. రైలు నెం. 22819 భువనేశ్వర్-విశాఖపట్నం  ఎక్స్‌ప్రెస్
15. రైలు నెం. 22820 విశాఖపట్నం-భువనేశ్వర్  ఎక్స్‌ప్రెస్
16. రైలు నెం. 22859 పూరీ – MGR చెన్నై సెంట్రల్  ఎక్స్‌ప్రెస్
17. రైలు నెం. 22871 భువనేశ్వర్-తిరుపతి  ఎక్స్‌ప్రెస్
18. రైలు నెం. 22880 తిరుపతి-భువనేశ్వర్  ఎక్స్‌ప్రెస్
19. రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం  ఎక్స్‌ప్రెస్
20. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్  ఎక్స్‌ప్రెస్
21. రైలు నెం.08528 విశాఖపట్నం-రాయ్‌పూర్  ఎక్స్‌ప్రెస్
22. రైలు నెం. O8527 రాయ్‌పూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
23. రైలు నెం. 18513 కిరండూల్- విశాఖపట్నం  ఎక్స్‌ప్రెస్

READ ALSO: https://telugu.asianetnews.com/andhra-pradesh/deep-depression-intensifies-into-cyclone-jawed-r3j6ng

 06/12/2021న రద్దు చేయబడిన రైళ్లు..

1.రైలు నెం. 18418 గుణుపూర్ -పూరి  ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం.18108 జగ్దల్‌పూర్- రూర్కెలా  ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం. 22818 మైసూర్-హౌరా ఎక్స్‌ప్రెస్
4. రైలు నెం.12808 హజారత్ నిజాముద్దీన్-విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్ 
 
 07/12/2021న రద్దు చేయబడిన రైళ్లు..

1. రైలు నెం. 18638 బెంగుళూరు కాంట్- హాటియా ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం. 02984 అగర్తలా- బెంగళూరు కాంట్ ఎక్స్‌ప్రెస్
 
 08/12/2021న రద్దు చేయబడిన రైళ్లు..

1. రైలు నెం.  12552 కామాఖ్య-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం. 20820 ఓఖా -పూరి ఎక్స్‌ప్రెస్
 
 09/12/2021న రద్దు చేయబడిన రైళ్లు..

1. రైలు నెం. 12514 గౌహతి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడింది
 

Follow Us:
Download App:
  • android
  • ios