తుఫానుగా బలపడుతోన్న అల్పపీడనం... ఉత్తరాంధ్రకు పొంచి వున్న ముప్పు, శనివారం ఉగ్రరూపమే
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని (bay of bengal) ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో అల్పపీడనం (depression) బలపడుతోంది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని (bay of bengal) ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో అల్పపీడనం (depression) బలపడుతోంది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం వుందని తెలిపింది. శనివారం ఉదయం నాటికి ఇది ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం వుందని ఐఎండీ (imd) హెచ్చరించింది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Also Read:Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరో వానగండం.. దూసుకొస్తున్న తుఫాన్
రేపు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతోనూ.. ఎల్లుండి ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే భారీ వర్షాలు (Heavy rains), వరదలతో సతమతవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలుకు ఇది మరో పిడుగులాంటి వార్త. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణ నష్టంతో పాటుగా, భారీగా ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతం చేశాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు తుఫాన్ (Cyclone) దూసుకోస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.