భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా1260 విడుదల, ధర రూ.18 లక్షలు

Ducati Launches Multistrada 1260 In India
Highlights

భారత మార్కెట్లో మరో లగ్జరీ సూపర్‌బైక్ విడుదలైంది. ఇటాలియన్ స్పోర్ట్స్ బైక్స్ కంపెనీ డ్యుకాటి దేశీయ విపణిలో మల్టీస్రాడా 1260 అనే సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది.

భారత మార్కెట్లో మరో లగ్జరీ సూపర్‌బైక్ విడుదలైంది. ఇటాలియన్ స్పోర్ట్స్ బైక్స్ కంపెనీ డ్యుకాటి దేశీయ విపణిలో మల్టీస్రాడా 1260 అనే సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ మోటార్‌బైక్ ప్రారంభ ధరను 15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 18.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

డ్యుకాటి నుంచి విడుదలైన ఈ మల్టీస్ట్రాడా 1260 మోటార్‌బైకులో అధునాతన  1262సీసీ ఇంజన్‌ను అమర్చారు. అందుకే ఈ మోడల్ పేరులో 1260 అనే నెంబర్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 158 బిహెచ్‌పిల శక్తిని, 129.5ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ బైక్‌లో వెహికల్ హోల్డ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యుకాటి వీలీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బైక్ లీటరుకు 19.20 కిలో మీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ కొత్త బైకుల్లో ట్రాక్షన్‌ కంట్రోల్‌, క్రూజ్‌ కంట్రోల్‌తోపాటు 1262 సిసి ఇంజన్‌, సెల్ఫ్‌స్టార్ట్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. లీటర్‌ ఇంధనానికి ఈ బైక్‌లు 19.20 కిలో మీటర్ల మైలేజీని ఇవ్వనున్నాయి. డుకాటీ ఇప్పటికే దేశీయ మార్కెట్లో మల్టీస్ర్టాడా 950, మల్టీస్ర్టాడా 1200 మోడళ్లను విక్రయిస్తోంది.

loader