కొత్త భాషా యుద్ధం మొదలు పెట్టొద్దు.. భారత ఐక్యతను కాపాడండి - కేంద్రానికి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి
కొత్త భాషా యుద్దం మొదలు పెట్టకూడదని, దేశం ఐక్యంగా ఉండేాలా చూడాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హిందీ భాషపై పార్లమెంటరీ ప్యానెల్ చేేసిన సిఫార్సులను ఆయన తప్పుబట్టారు.
హిందీని తప్పనిసరి భాషగా పేర్కొంటూ మరో “భాషాయుద్ధం” ప్రారంభించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ఆ దిశగా ప్రయత్నాలను విరమింకొని భారతదేశ ఐక్యతను కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
అన్ని సెంట్రల్ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు సెంట్రల్ వర్సిటీలలో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సుపై వచ్చిన వార్తలపై సీఎం స్పందించారు. ప్యానెల్ చేసిన సిఫార్సులలో ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంలు, కేంద్ర విద్యాలయాల వంటి సంస్థలు కూడా ఉన్నాయి.
"అధినేత్రి ఆదేశాలతోనే అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా"
ఈ సిఫార్సులను అమలు చేస్తే దేశ ఐకత్య నాషనం అవుతుందని స్టాలిన్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం అంతటా హిందీని సాధారణ భాషగా చేయాలని ప్యానెల్ సిఫార్సు చేసిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో తమిళంతో సహా 22 భాషలను సమాన హోదా ఇచ్చారని స్టాలిన్ గుర్తు చేశారు. భారతదేశంలో హిందీని ఉమ్మడి భాషగా సిఫారసు చేయడానికి ప్యానెల్ కు ఎందుకు అవసరం వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
‘‘ హిందీకి ప్రాధాన్యత ఇవ్వడానికి యూనియన్ రిక్రూట్‌మెంట్ పరీక్షలలో ఇంగ్లీష్ భాషా ప్రశ్నపత్రాలను నిలిపివేయాలని ఎందుకు సిఫార్సు చేశారు ’’ అని స్టాలిన్ అన్నారు. దేశం మొత్తానికి ఒక భాషను ఉమ్మడిగా చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యం అని తెలిపారు. ఇలా ఒక భాషను తప్పనిసరి చేయడం వల్ల భారతదేశంలో హిందీ మాట్లాడే వారు మాత్రమే సరైన పౌరులు, ఇతర భాషలు మాట్లాడే వారు సెకెండ్ క్లాస్ క్లాస్ పౌరులు అని చెప్పడంతో సమానం అవుతుందని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.
భార్యను చంపాలని ప్లాన్ వేశాడు.. కానీ, అత్త హతమైంది.. పరారీలో నిందితుడు
ఇదిలా ఉండగా.. గత నెలలో నిర్వహించిన హిందీ దివాస్ (సెప్టెంబర్ 14) సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలై కూడా స్టాలిన్ మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లోని అన్ని భాషలను కేంద్రం అధికారిక భాషలుగా పరిగణించాలనీ, దేశ సంస్కృతి, చరిత్రను బలోపేతం చేయడానికి “హిందీ దివాస్” బదులుగా సెప్టెంబర్ 14వ తేదీన “భారతీయ భాషల దినోత్సవం”గా పాటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రికి స్థానిక భాషలపై శ్రద్ధ ఉంటే సంస్కృతం,హిందీతో సమానంగా దేశంలోని అన్ని భాషలకు నిధులు కేటాయించాలని చెప్పారు.
భారత్ జోడో యాత్రపై ఈసీకి ఫిర్యాదు.. మరీ కాంగ్రెస్ వివరణేంటీ?
అన్ని భాషల అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా.. జాతీయ విద్యా విధానం ద్వారా హిందీని అందరిపై రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని ఆయన ఆరోపించారు. భారతదేశం సంస్కృతి-చరిత్రను అర్థం చేసుకోవాలంటే హిందీని నేర్చుకోవాలని చెప్పడం అంటే వివిధ భాషలు మాట్లాడే వ్యక్తులతో నిండి ఉన్న భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి విరుద్ధమని తెలిపారు. భారత సంస్కృతి, చరిత్ర హిందీలోనే దాగి ఉండవని, తమిళం నేతృత్వంలోని ద్రావిడ భాషా కుటుంబం నేటి భారతదేశం, దాని వెలుపల విస్తరించిందని చరిత్రకారులు ఎత్తి చూపుతున్నారని స్టాలిన్ గుర్తు చేశారు.