భార్యను చంపాలని ప్లాన్ వేశాడు.. కానీ, అత్త హతమైంది.. పరారీలో నిందితుడు
మధ్యప్రదేశ్‌లో ఓ తాగుబోతు కట్టుకున్న భార్యను కడతేర్చాలని ప్లాన్ వేశాడు. కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది. భార్య తల్లి బలైంది. డోర్‌కు కరెంట్ వైర్ చేర్చిన నిందితుడు.. అత్త స్పాట్‌లోనే మరణించడంతో పరారయ్యాడు.
భోపాల్: భార్య భర్తల మధ్య గొడవలు సహజం. భర్త తాగుబోతు అయితే.. గొడవలు నిత్యం జరుగుతాయి. మద్యం చిచ్చు అసలే మానదు. ఈ వ్యసనం భార్య భర్తలను విడదీసే వరకు వెళ్లుతుంది. విడిపోవడం కాదు కదా.. ఏకంగా భార్యను హతమార్చాలనే మధ్యప్రదేశ్‌లోని ఓ భర్త ప్లాన్ వేశాడు. కరెంట్ షాక్‌తో భార్యను చంపేయాలని అనుకున్నాడు. అందుకు ప్లాన్ కూడా వేశాడు. కానీ, భార్య కాకుండా.. భార్య తల్లి ఆ ప్లాన్‌కు బలైంది. ఈ ఘటన బేతుల్ జిల్లా కొత్వాలీ పోలీసు స్టేషన్ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఆ వ్యక్తి ఎప్పుడూ మద్యం తాగేవాడని పోలీసు అధికారి తెలిపాడు. ఓ రోజు ఆ వ్యక్తికి, ఆయన భార్యకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత ఆయన భార్య.. తల్లిగారింటికి వెళ్లింది. ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోవడంపై భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అత్తవాళ్ల ఇంటికి ఆయన కూడా వెళ్లాడు.
Also Read: 36యేళ్లుగా కూతుర్ని గదిలో గొలుసుతో బంధించిన తండ్రి, మలమూత్రవిసర్జన అక్కడే, తలుపు కిందినుంచే భోజనం..
అక్కడే తన భార్యను చంపేయాలని అనుకున్నాడు. అత్తవారి ఇంటికి మెయిన్ డోర్ ఐరన్‌తో చేయించింది ఉన్నది. ఈ ఐరన్ డోర్‌కు ఎలక్ట్రిక్ వైర్ ఆనించి ఉంచాడు. ఆ ఐరన్ డోర్‌ను తన భార్య ముట్టుకుని కరెంట్ షాక్‌తో మరణిస్తుందని ఆ తాగుబోతు భావించాడు. కానీ, భార్య కంటే ముందుగానే అత్త ఆ డోర్‌ను పట్టుకుంది. దీంతో ఆమె స్పాట్‌లోనే మరణించింది.
ఈ ఘటన జరగ్గానే నిందితుడు స్పాట్ నుంచి పారిపోయాడు. అతడిని గాలిస్తున్నామని పోలీసులు వివరించారు. నిందితుడపై కేసు పెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.