Asianet News TeluguAsianet News Telugu

సోనియా, రాహుల్ విచారణ తర్వాత ఈడీ దూకుడు.. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో సోదాలు

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు.. ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ వార్తపత్రిక కార్యాయాలతో పాటు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన పలుచోట్ల ఈడీ దాడులు  చేస్తోంది. 

ED conducts raids at National Herald Office
Author
First Published Aug 2, 2022, 12:42 PM IST

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగిస్తుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పలు దఫాలుగా ఐదు రోజులు ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోనియా గాంధీని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే సోనియాను ప్రశ్నించిన కొద్ది రోజులు తర్వాత ఈడీ మరింత దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ వార్తపత్రిక కార్యాయాలతో పాటు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన పలుచోట్ల ఈడీ దాడులు  చేస్తోంది. మొత్తంగా 12 చోట్ల ఈడీ మంగళవారం దాడులు చేస్తున్నట్టుగా నివేదికలు వెలువడతున్నాయి. 

ఈ కేసుకు సంబంధించి గత నెల చివరిలో సోనియా గాంధీని ఈడీ మూడు రోజుల పటు ప్రశ్నించింది. దాదాపు 12 గంటల పాటు విచారణ కొనసాగగా.. ఆమెను ఈడీ అధికారులు 100 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది.  అంతకు ముందుకు సోనియా కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని  ఐదు రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయనను దాదాపు 150 ప్రశ్నలు అడిగారు.

భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కంపెనీని యంగ్ ఇండియన్ టేకోవర్ చేయడంతో "నేషనల్ హెరాల్డ్ కేసు" అని పిలవబడే దానిలో గాంధీలు దర్యాప్తు చేస్తున్నారు.

యంగ్ ఇండియన్ కంపెనీ కూడా AJL యొక్క ఆస్తులలో రూ. 800 కోట్లకు పైగా తీసుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ఇది యంగ్ ఇండియన్ వాటాదారులు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆస్తిగా పరిగణించబడాలని.. దీనికి వారు పన్ను చెల్లించాలి. అయితే వీటిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. యంగ్ ఇండియన్ "లాభాపేక్ష లేని" కంపెనీ అని.. అందువల్ల మనీలాండరింగ్ గురించి ప్రశ్నకే ఆస్కారం లేదని కాంగ్రెస్ చెబుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios