ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మధ్యప్రదేశ్ లోని కునా నేషనల్ పార్క్ లో 8 చిరుతలను విడుదల చేశారు. గతంలో మన దేశంలో ఎన్నో చిరుతలు ఉండేవి. ప్రస్తుతం అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అయితే 1939 సమయంలో చిరుతలను వేట కోసం ఎలా ఉపయోగించారో చూపే వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్వీట్ చేశారు.
నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు పూర్తిగా బిజీ బిజీగా గడపనున్నారు. నేడు అనేక ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే వీటిలో ఒక కార్యక్రమం దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో 8 చిరుతలను విడుదల చేయడం. కొంత సమయం కిందట వాటిని ప్రధాని అభయారణ్యంలోకి విడుదల చేశారు.
ఈ చిరుతలను ఆఫ్రికాలోని నమీబియా నుంచి తీసుకొచ్చారు. దీని కోసం ఏడాది ప్రారంభంలో మన దేశం ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో దీనిని ప్రాజెక్ట్ చిరుత అని పిలుస్తున్నారు. దేశంలోని వన్యప్రాణులకు మరింత వైవిధ్యాన్ని తీసుకురావడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. అయితే చిరుతలను తరలించడానికి చేపట్టిన తొలి ఖండాంతర ప్రాజెక్ట్ ఇదే.
కాగా.. అసలు విదేశాల నుంచి చిరుతలను ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చేందనే ప్రశ్న అనేక మంది మదిలో మెదులుతోంది. గతంలో మన దేశంలో అనేక చిరుతలు అడవిలో స్వేచ్చగా తిరిగేవి. కానీ అవి నేడు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అందులో 1939 సంవత్సరంలో దేశంలోని చిరుతలను ఎలా వేటాడారో స్పష్టంగా చూపించారు. వాటిని మచ్చిక చేసుకొని వేట కోసం ఎలా ఉపయోగించుకున్నారో కూడా కనిపిస్తోంది.
‘‘ ప్రస్తుతం చిరుతలను భారత దేశానికి తిరిగి తీసుకువస్తున్నారు. అయితే గతంలో వేట పార్టీల కోసం చిరుతలను వేటాడారు. వాటిని పెంపుడు జంతువులుగా ఎలా ఉపయోగించుకున్నారో అనే దానిపై రూపొందించిన వీడియో ఇది. దీనిని 1939లో రికార్డు చేశారు.’’ అని ఆయన ట్వీట్ చేేశారు.‘‘ చిరుత మానవులతో అతి తక్కువ వైరుధ్యంలో ఉన్నట్లు చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. బదులుగా వారు పెంపకం మరియు విస్తృతంగా వేట పార్టీలచే ఉపయోగించబడ్డారు. కొందరు వాటిని ‘వేట చిరుతలు’ అని కూడా పిలిచేవారు.’’ అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి భారీ భద్రత ఉంటుందో తెలుసా ? అసలు ఎస్పీజీ అంటే ఏమిటి ?
‘‘ చిరుతలే కాదు, చాలా ఆకర్షణీయమైన జంతువులను ఆ రోజుల్లో రాజులు, బ్రిటిష్ వారు వేటాడేవారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972 ఆమోదించినా.. అప్పటికే ఆలస్యం అయ్యింది. భారతదేశం నుంచి చిరుత లు అంతరించిపోయాయి. ’’ అని ట్వీట్ చేశారు.
కాగా.. 1947లో దేశంలోని చివరి మూడు చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కొరియా రాచరిక రాష్ట్రానికి చెందిన మహారాజా రామానుజ్ ప్రతాప్ సింగ్ డియో వేటాడినట్టు నివేదికలు ఉన్నాయి. దీని ఫొటో బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీలో ఉంది. అప్పటి నుంచి భారతదేశంలో చిరుతలు పూర్తిగా అంతరించిపోయాయి. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకొచ్చారు.
ఆసుపత్రి బెడ్‌పై కుక్క..మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాసుపత్రిలో ఘటన, వీడియో వైరల్...
1556 నుండి 1605 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో భారతదేశంలో సుమారు 10 వేల చిరుతలు ఉండేవని చరిత్ర చెబుతోంది. అక్బర్ కూడా స్వయంగా చాలా చిరుతలను పెంచుకునేవాడు. వాటిని వేటకు ఉపయోగించారు. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతదేశంలో చిరుతల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయింది.
