Asianet News TeluguAsianet News Telugu

ఆసుపత్రి బెడ్‌పై కుక్క..మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాసుపత్రిలో ఘటన, వీడియో వైరల్...

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని ఓ ఆసుపత్రి బెడ్‌పై కుక్క నిద్రిస్తున్న వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

dog on hospital bed video goes viral in madhyapradesh
Author
First Published Sep 17, 2022, 9:04 AM IST

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్‌పై కుక్క పడుకున్న వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇది రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థపై ఆందోళన కలిగిస్తోందని ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. 

దీనిమీద రత్లాం చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ నానవరేను వివరణ కోరగా.. తాను సెలవులో ఉన్నందున ఈ సంఘటన గురించి తనకు తెలియదని తెలిపారు. ఈ వీడియోను ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో కుక్కలు మంచిగా నిద్రపోతున్నాయని, రోగులు ఆసుపత్రులలో పడకలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు అని దీనికి కామెంట్ చేశారు.

ఈ వీడియో ఇక్కడ అలోట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందినదని సలుజా పేర్కొన్నారు. దీనికి ఆయన "ఆందోళన కలిగించే ఆరోగ్య వ్యవస్థ" అని సలుజా ట్వీట్ చేశారు.

పాము పగపట్టిందా?!.. ఒకే యువకుడిని, ఒకే చోట 5సార్లు కాటేసిన విషసర్పం...!

ఇదిలా ఉండగా, సెప్లెంబర్ 13న కేరళలో జరిగిన ఓ ఘటన షాక్ కు గురి చేసింది. కేరళలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. పగ బట్టినట్టుగా చిన్నారుల మీదికి ఎగబడుతున్నాయి. కొందరు విద్యార్థులను వీధికుక్కలు తరిమిన ఘటన మరువకముందే అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన మటుకు తాను ఆడుకుంటుండగా ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడి పై కక్షగట్టిందా అన్న రేంజ్లో దాడిచేసి గాయపరిచింది. కాగా ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  

వివరాల ప్రకారం.. కోజికోడ్ జిల్లాలోని అరక్కినార్ లో సైకిల్ పై వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణ రహితంగా చేతులు, కాళ్లపై కొరికింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా బాలుడిపై కక్ష కట్టిన అన్న రేంజ్లో కుక్క దాడి చేసింది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లో ఇదంతా రికార్డయింది. ఈ  రికార్డ్ ద్వారానే ఈ వీడియో బయటకు వచ్చింది.  

అలాగే కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధికుక్కలు తరిమిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఆ విద్యార్థులు ఇద్దరు వెంటనే పరుగెత్తుకుని వచ్చి ఓ ఇంట్లో గేటు వేసి దాడి నుంచి తప్పించుకున్నారు.  దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజనులు స్పందిస్తూ కేరళను డాగ్స్ ఓన్ కంట్రీ అని కామెంట్ చేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios