కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్షాలు ఆగడం లేదు. తీరిక లేకుండా కురుస్తున్న వానల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు ప్రాంతాల్లో ముగ్గురు చనిపోయారు.

బెంగళూరులో ఎడతెర‌పి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌వుతున్నాయి. వ‌ర్షాల వ‌ల్ల ప‌లు చోట్ల చెట్లు విరిగి క‌రెంటు పోల్స్ పై ప‌డిపోతున్నాయి. దీంతో క‌రెంటు కోత‌లు ఏర్ప‌డుతున్నాయి. అయితే ఈ వ‌ర్షాల వ‌ల్ల మూడు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. 

Agnipath: ఒక‌వైపు అగ్నిప‌థ్ నిర‌స‌న‌లు.. మ‌రోవైపు అగ్నివీరుల‌కు ప్రోత్సాహ‌కాలు !

కేఆర్ పురంలో 24 ఏళ్ల ఇంజ‌నీర్ మిథున్ మృతి చెందాడు. ఆయ‌న శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకాలోని అదరంథే గ్రామాని చెందిన వాడు. కాగా ఆయ‌న బెంగళూరులోని కె.ఆర్.పురంలోని గాయత్రినగర్ నివాసం ఉంటున్నాడు. బెంగ‌ళూరుకు చెందిన ఓ కంపెనీలో ప‌ని చేస్తున్న మిథున్ శుక్ర‌వారం మృతి చెందాడ‌ని పోలీసులు తెలిపారు. 

రెండో ఘటనలో ఉత్తరహళ్లిలోని ఎస్జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ చ‌దివే విద్యార్థి ప్ర‌జ్వ‌ల్ మృతి చెందాడు. అత‌డు హసన్ జిల్లాలోని అర్కల్గుడ్ కు చెందిన వ్య‌క్తి. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రజ్వల్ తన స్నేహితుడు రవిచంద్రతో కలిసి కారులో తిరిగి తమ ఇంటికి వెళ్త‌న్నారు. ఈ క్ర‌మంలో కారు అదుపు త‌ప్పి స‌ర‌స్సులోకి దిగింది. అయితే రవిచంద్ర ఏదో విధంగా కారు దిగి రోడ్డుపైకి ఈదుకుంటూ వెళ్లగా, ప్రజ్వల్ బయటకు రాలేక వాహనంలో ఇరుక్కుపోయి చనిపోయాడు.

Jammu Kashmir: ఉగ్ర‌వాదులు-భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య కాల్పులు.. న‌లుగురు టెర్ర‌రిస్టులు హ‌తం

మూడో ఘటనలో వి.మునియమ్మ అనే మహిళ గోడ కూలిపోవడంతో మరణించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఒక్క సారిగా గోడ కూలింది. దీంతో ఆమె శిథిలాల్లో చిక్కుకుపోయింది. అయినప్పటికీ కుటుంబ స‌భ్యులు, ఇరుగు పొరుగు వారు ఆమెను బ‌య‌ట‌కు లాగి హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ ఆమెను ర‌క్షించ‌లేక‌పోయారు. హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మునియ‌మ్మ మృతి చెందింది. 

అసోంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల శ‌నివారం ఆ రాష్ట్రంలో ప‌రిస్థితి మరింత దిగజారింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో మరణాల సంఖ్య 63కి పెరిగింది. 32 జిల్లాల్లో ప్రభావితమైన వారి సంఖ్య దాదాపు 31 లక్షలకు పెరిగింది. బార్‌పేట, కరీంగంజ్‌లలో ఇద్దరు చొప్పున, దర్రాంగ్, హైలకండి, నల్బరీ, సోనిత్‌పూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వ‌ర‌ద‌ల కార‌ణంగా మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 514 సహాయ శిబిరాల్లో 1.56 లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకున్నారు. శిబిరాల్లో లేని ఇతర బాధిత జనాభాకు కూడా సహాయ సామగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. డిమా హసావో, గోల్‌పరా, హోజాయ్, కమ్‌రూప్, కమ్రూప్ (మెట్రోపాలిటన్), మోరిగావ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.

ప్రారంభోత్సవానికి వచ్చి, స్వయంగా చెత్త ఎత్తిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్

ఇదిలా ఉండ‌గా రుతుపవనాలు భారత ఉపఖండంలోకి మరింత ముందుకు సాగుతున్నందున, రాబోయే ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం వెల్ల‌డించింది. వచ్చే 24 గంటల్లో ఈశాన్య భారతదేశం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో తీవ్రమైన వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేసింది. ఆ తర్వాత తగ్గుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.