చెన్నై: డీఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్యానికి సంబంధించి కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

చెన్నై: డీఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్యానికి సంబంధించి కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

మంగళవారం సాయంత్రం కావేరీ ఆసుపత్రి వైద్యులు కరుణానిధి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొన్ని గంటలుగా కరుణానిధి అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు ప్రకటించారు.

కరుణానిధి ఆరోగ్యం విషమించిందని కావేరీ ఆసుపత్రి వైద్యులు సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఈ తరుణంలో 24 గంటల పాటు ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచాలని  వైద్యులు ప్రకటించారు. అయితే మంగళవారం నాటికి  కరుణానిధిఆరోగ్యంలో మార్పులు రాలేదు.  పరిస్థితి మరింత విషమించింది.

మేం చేయగలిగిందంతా చేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కానీ, కరుణానిధి అవయవాలు వైద్యానికి సహకరించడం లేదని కావేరీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని  తాజా హెల్త్‌బులెటిన్‌లో వైద్యులు ప్రకటించారు. 

  కరుణాధి అవయవాలు వైద్య చికిత్సకు కూడ సహకరించడం లేదని కావేరీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. 

కరుణానిధికి చికిత్స చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.  కరుణానిధి నివాసం వద్ద కూడ  ఫెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే డీఎంకె కు చెందిన  ఎంపీలను హుటాహుటిన చెన్నైకు తరలిరావాల్సిందిగా డీఎంకె అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తను చదవండి: విషమంగా కరుణానిధి ఆరోగ్యం.. సీఎం నివాసానికి స్టాలిన్