పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులందరూ ఓపెన్ మైండ్ తో చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఎంపీలు లోతుగా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. అన్ని పార్టీలు ఈ సమావేశాలను చక్కగా ఉపయోగించుకోవాలని తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీల సభ్యులు పార్లమెంటు సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. వివిధ విషయాలపై ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపాలని అన్నారు. ఎంపీలందరూ లోతుగా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు.ర అవసరమైతే విమర్శించాలని కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మీడియాను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు.
“ ప్రతీ ఒక్కరి కృషి వల్లనే సభ నడుస్తోంది. కాబట్టి సభ గౌరవాన్ని పెంచేందుకు మనమందరం మన కర్తవ్యాన్ని, గౌరవాన్ని పాటించాలి. ఈ సమావేశాలు జాతీయ ప్రయోజనాలకు దోహదపడుతాయి. దీనిని ఎక్కువగా ఉపయోగించుకోవాలి ’’ అని ఆయన అన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే చివరి సారిగా పోటీ చేస్తా - కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
సభ సమర్ధవంతమైన సమాచార మాధ్యమమని ప్రధాని అన్నారు. దీనిని తాను తీర్థయాత్రగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. “ విధానం, నిర్ణయాలలో చాలా సానుకూల సహకారం అందించేందుకు మంచి సమీక్ష జరిపి విషయాలను నిశితంగా విశ్లేషించాలి. ఎంపీలందరూ లోతుగా ఆలోచించి మంచి చర్చలు జరపాలని, తద్వారా సభను మరింత అర్థవంతంగా, ఉపయోగకరంగా నిర్వహించాలని కోరుతున్నాను. ’’ అని ప్రధాని మోడీ అన్నారు.
Chhattisgargh: చేయని తప్పుకు ఐదేళ్ల జైలు శిక్ష.. 121 మంది గిరిజనుల విడుదల
ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం అని, రాబోయే 25 సంవత్సరాల ఆగస్ట్ 15కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని ప్రధాని అన్నారు. 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల దిశగా దేశం ప్రయాణాన్ని నిర్ణయించే తీర్మానం చేయడానికి ఈ కాలం చాలా ముఖ్యమైనదని చెప్పారు.ర ‘‘ ఈ సమావేశాలు కూడా ముఖ్యమైనవి.ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఓటింగ్ (రాష్ట్రపతి ఎన్నికలకు) జరుగుతోంది. ఈ కాలంలో కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దేశానికి మార్గదర్శకత్వం వహించడం ప్రారంభిస్తారు ’’ అని అన్నారు.
కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం 32 బిల్లులను రూపొందించింది. ‘‘ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ముప్పై రెండు బిల్లులు సమర్పించడానికి వివిధ శాఖలు నివేదికలు అందించాయి. వాటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. అయితే మేము చర్చ లేకుండా బిల్లులను ఆమోదించబోము ’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
Vice President Election: నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీఏ అభ్యర్థి ధన్‌కర్.. హాజరైన ప్రధాని మోదీ..
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్ధం అయ్యాయి. అగ్నివీర్ పథకం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి పతనంతో పాటు రైతుల సమస్యలు, ఎంఎస్‌పీ, నిరుద్యోగం, ఇండో-చైనా సరిహద్దుల పరిస్థితులు, దేశంలో పెరుగుతున్న ఉద్రిక్తత, నుపుర్ శర్మ వంటి అనేక ఇతర అంశాలపై ప్రతిపక్షాలు చర్చించాలని భావిస్తున్ఆయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నాయి.
