కర్ణాటకలో 2023 సంవత్సరంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే తాను చివరి సారిగా పోటీ చేస్తానని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య మరో సారి స్పష్టం చేశారు. తన టర్మ్ అయిపోయిన తరువాత ఏ పదవిని కూడా స్వీకరించబోనని అన్నారు.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే తాను చివరిగా పోటీ చేసేది అని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. అయితే 2018లో తాను ఓడిపోయిన చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి మాత్రం పోటీ చేయబోనని చెప్పారు. తన పదవీ కాలం పూర్తయిన తరువాత తాను రాజ్యసభ పదవిని కూడా అంగీకరించబోనని స్పష్టం చేశారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. “ నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను, మీరు (కాంగ్రెస్ కార్యకర్తలు) ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. నేను చాముండేశ్వరి నుండి మళ్లీ పోటీ చేయను. సిద్దరామయ్య తన పాత స్థానం నుంచి పోటీ చేస్తారని ఎవరూ చెప్పొద్దు. మేము ఒక అభ్యర్థిని అక్కడి నుంచి నిలబెడుతాం. నేను ఎందుకు పోటీ చేస్తున్నానో తెలుసా ? ఈ అవినీతి ప్రభుత్వం పోవాలి. ఈ మతతత్వ ప్రభుత్వం పోవాలి ’’ అని ఆయన అన్నారు.
Coronavirus: తగ్గిన కేసులు.. పెరిగిన కరోనా మరణాలు
‘‘ నేను మళ్లీ పోటీ చేయను. ఆ (టర్మ్) తర్వాత నేను ఏ పదవిని అంగీకరించను. నన్ను రాజ్యసభ సభ్యుడిగా లేదా మరేదైనా పదవి తీసుకోవాలని కోరినా నేను దానికి అంగీకరించను ’’ అని సిద్ధా రామయ్య తేల్చిచెప్పారు. తనపై బీజేపీ చేసిన తప్పుడు ప్రచారం వల్ల చాముండేశ్వరి స్థానం నుంచి తాను ఓడిపోయనని ఆరోపించారు. తన ప్రభుత్వ కార్యక్రమాలను, దాని విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ కార్యకర్తల వైఫల్యం కూడా ఉందని ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నర్మద నదిలో పడిన బస్సు.. 12 మంది మృతి..
‘‘ మీ తలలో నుంచి ఆ ఆలోచన తీసేయండి.. మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయను.. చాలా చాలా చాలా స్పష్టంగా చెబుతున్నాను.. 2018లో చాముండేశ్వరి ప్రజలు నా చేయి వదిలేసారు.. కానీ బాదామి ప్రజలు నా చేతులు పట్టుకున్నారు. నన్ను మళ్లీ అక్కడి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. అలాగే కోలార్, కొప్పల్, హున్‌సూరు, వరుణలో ఉన్న ప్రజలు కూడా నన్ను అక్కడి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. కానీ నేను ఇంకా నిర్ణయించుకోలేదు. నన్ను ఎక్కడ పోటీ చేయాలని అడిగితే అక్కడే చేస్తాను ” అని ఆయన అన్నారు.
కాగా.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సిట్టింగ్ స్థానం చాముండేశ్వరి నుంచి 2018 ఎన్నికల్లో బరిలో దిగారు. అయితే అక్కడ జేడీ(ఎస్) జీటీ దేవెగౌడ చేతిలో 36,042 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం అయిన బాదామిలో కేవలం 1,696 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి బి శ్రీరాములుపై గెలుపొందారు. 2013-2018 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే, రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టాలనే ఆశయంతో ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌కు కూడా ఇలాంటి ఆకాంక్షే ఉంది. అయితే దీని వల్ల ఇద్దరి మధ్య కొంత విభేదాలు వచ్చాయని అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
