ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ధన్‌కర్ నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ధన్‌కర్ నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీకి ధన్‌కర్ ధన్యవాదాలు తెలిపారు. ఇక, పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి జగదీప్ ధన్‌కర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.

మరోవైపు ఆగస్టు 6వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో విపక్షాలు తమ అభ్యర్థిగా Margaret Alva‌ను ప్రకటించాయి. అయితే ఆమె నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఇక, రేపటితో ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల దరఖాస్తు గడువు ముగియనుంది. జూలై 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూలై 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా నిర్ణయించారు. ఇక, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం.. ఆగష్టు 10వ తేదీతో ముగియనుంది.