ఎన్సీపీలో తిరుబాటు చేసి పలువురు ఎమ్మెల్యేలను తన వెంట తీసుకొని మహారాష్ట్ర షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన తన అనుచరులకు ముఖ్యమైన శాఖలు కోరగా.. వాటిని షిండే, ఫడ్నవీస్ తిరస్కరించాలని తెలుస్తోంది.
ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవర్ కు ఆశాభంగం కలిగింది. ఆయన వెంట తీసుకువచ్చిన నాయకులకు రెండు ముఖ్య శాఖలను ఆయన కోరారు. కానీ దానిని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్ లు తిరస్కరించారు. ఈ ముగ్గురు నేతల మధ్య మంగళవారం రాత్రి మంత్రి పదవుల విషయంలో సమావేశం జరిగింది.
పోలీసుల కళ్లలో కారం కొట్టి.. గ్యాంగ్ స్టర్ కుల్దీప్ జగినాను కాల్చి చంపిన క్రిమినల్స్..
ఈ సమావేశంలో కేబినెట్ శాఖలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని అజిత్ పవార్ డిమాండ్ చేశారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. మంత్రివర్గంలో కనీసం రెండు ముఖ్యమైన శాఖలు తన శిబిరానికి దక్కేలా చూడాలని ఆయన కోరుతున్నారు. కానీ దీనిని ఆ నాయకులు తోసిపుచ్చారు. ముందుగా మంత్రివర్గ విస్తరణ జరగాలని, శాఖల కేటాయింపు జరగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.ఖాళీగా ఉన్న బెర్తులను మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాతే శాఖల కేటాయింపును ప్రకటించాలని సీఎం ఏక్ నాథ్ షిండే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో శివసేన ఎమ్మెల్యేలను శాంతింపజేసేందుకు సీఎం రాత్రంతా ప్రయత్నించారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. రన్ వేపై దొర్లుతూ వెళ్లడంతో.. వీడియో వైరల్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ నేతృత్వంలో పార్టీలో చీలిక వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు పది రోజులైంది. అజిత్ పవార్ ఇప్పుడు తమ పార్టీ నేతలకు ప్రాధాన్యతా క్రమంలో శాఖలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. మొత్తం 42 మంత్రి పదవులకు గాను 14 బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి నాలుగు బెర్తులు దక్కే అవకాశం ఉందని, మిగిలిన 10 బెర్తులు శివసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు సమానంగా పంచుతాయని విశ్వసనీయ వర్గాలు ‘ఇండియా టుడే’కు తెలిపాయి.
సతారా సాంగ్లీ, పుణె, రాయ్ గఢ్ జిల్లాలకు గార్డియన్ మంత్రి పదవి ఇవ్వాలని అజిత్ పవార్ పట్టుబట్టినట్లు సమాచారం. అదేవిధంగా సీనియర్ నేతలు ఛగన్ భుజ్ బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్ లకు వారి అనుభవం, సీనియారిటీని బట్టి పలు శాఖలు దక్కాలని సూచించారని తెలుస్తోంది. ఆర్థిక, ఇంధన, జలవనరులు, సహకార, పబ్లిక్ వర్క్స్, హౌసింగ్ శాఖలను అజిత్ శిబిరం డిమాండ్ చేస్తోంది. అయితే, అజిత్ పవార్ వర్గానికి కీలక శాఖలు ఇవ్వడం వల్ల వ్యతిరేకత పెరుగుతుందని శివసేన, బీజేపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.
