శవాలు తేలుతాయ్.. మమతకి బీజేపీ నేత వార్నింగ్

First Published 20, Jun 2018, 2:41 PM IST
dilip ghosh warning to mamata banerjee
Highlights

శవాలు తేలుతాయ్.. మమతకి బీజేపీ నేత వార్నింగ్

పశ్చిమబెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుకుంది. టీఎంసీ నేతలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే బెంగాల్ బీజేపీ అధ్యక్షుుడు దిలీప్ ఘోష్ మరోసారి రెచ్చిపోయారు.. జల్‌పాయ్‌గురిలో జరిగిన ఓ బహిరంగసభలో పాల్గొన్న ఆయన.. తమ పార్టీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే.. తృణమూల్ కార్యకర్తలను ఎన్‌కౌంటర్ చేస్తామని హెచ్చరించారు.

ఆ పార్టీకి లొంగి ఉంటామని తామేమి బాండ్ రాయలేదన్నారు.. తమ వద్ద బుల్లెట్లు దండిగా ఉన్నాయని.. తల్చుకుంటూ ప్రతిచోటా శవాలు తేలుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. పంచాయతీ ఎన్నికలు జరిగిన కొద్దిరోజుల తర్వాత బలరాంపూర్‌లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా అలజడిని రేపింది. ఇలాంటి పరిస్ధితుల్లో దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఘర్షణ వాతావరణానికి కారణమవుతాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలోనూ.. పోలీసులు మమతకు అనుకూలంగా పనిచేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారి యూనిఫామ్‌లు తొలగిస్తామంటూ దిలీప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.
 

loader