Asianet News TeluguAsianet News Telugu

digital rape : మైనర్‌పై ఏడేళ్ల పాటు డిజిటల్ రేప్.. 81 ఏళ్ల టీచర్ ను అరెస్టు చేసిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ లో ఓ వృద్ధ‌ టీచర్ నీచానికి ఒడిగట్టాడు. మైనర్ అని కూడా చూడకుండా ఆమె పై ఏడేళ్ల పాటు డిజిటల్ రేప్ కు పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. 

Digital rape on a minor for seven years .. Police arrest an 81-year-old teacher
Author
Noida, First Published May 16, 2022, 1:48 PM IST

17 ఏళ్ల బాలికపై ఏడేళ్ల పాటు ‘డిజిటల్ రేప్’ చేసినందుకు 81 ఏళ్ల ఆర్టిస్ట్ కమ్ టీచర్‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు.  అతడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డిజిటల్ రేప్ అంటే మహిళ  ప్రైవేట్ భాగాలలో చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను బలవంతంగా చొప్పించడం అని అర్థం. నిందితుడు మారిస్ రైడర్‌ను స్కెచ్ ఆర్టిస్ట్ అని పోలీసులు తెలిపారు. అత‌డిపై 376 (అత్యాచారం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు న‌మోదు చేసి అరెస్టు చేసిన‌ట్టు సెక్టార్ 39 పోలీసులు చెప్పారు. 

ఈ కేసు విష‌యంలో సెక్టార్ 39 స్టేషన్ ఎస్‌హెచ్‌వో  రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న‌లో బాధితురాలు తన సంరక్షకుడితో కలిసి నివసిస్తుందని చెప్పారు. అత‌డు నిందితుడితో 20 సంవత్సరాలుగా స్నేహం చేస్తున్నాడని తెలిపారు. ఆ సమయంలోనే నిందితుడు ఆమెపై డిజిటల్ రేప్ కు పాల్పడ్డాడు. అయితే బాధిత బాలిక మొదట ఫిర్యాదు చేయడానికి భయపడింది. కానీ ఆమె ధైర్యం తెచ్చుకొని నిందితుడి లైంగిక దుశ్చ‌ర్య‌ను రికార్డ్ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి గణనీయమైన సాక్ష్యాలను సేకరించింది. త‌రువాత త‌న బాధ‌ను సంరక్షకుడికి వివరించింది. ఆపై ఫిర్యాదు చేయడానికి పోలీసులను ఆశ్రయించింది. . ‘‘ బాధిత బాలిక తన సంరక్షకుడితో కలిసి ఇక్కడ నివసిస్తోంది. అతడు నిందితుడికి సుమారు 20 సంవత్సరాలుగా స్నేహితుడు. ఈ కేసులో సంరక్షకుడు ఫిర్యాదు చేసాడు. ’’ దీంతో నిందితుడిపై కేసు న‌మోదు చేసుకొని, అరెస్టు చేసిన తరువాత స్థానిక కోర్టులో హాజరుపరిచామని అన్నారు. 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించామ‌ని అన్నారు. 

జ్ఞానవాపి మసీదులో సర్వే సమాప్తం.. శివలింగం గుర్తించినట్టు న్యాయవాది వెల్లడి.. ఆ ఏరియాను సీల్ చేయాలన్న కోర్టు
 
గ‌తంలో ఈ డిజిట‌ల్ రేప్ ను లైంగిక నేరంగా ప‌రిగణించే వారు కాదు. 2013లో పార్లమెంటులో కొత్త రేప్ చట్టాలు ఆమోదించబడే వరకు డిజిటల్ రేప్‌ను వేధింపుగా గుర్తించేవారు. అయితే 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత కొత్త చట్టాలు తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఏర్ప‌డిన నిర‌స‌న వ‌ల్ల ప్ర‌భుత్వం స్పందించి చ‌ట్టాల‌ను స‌వ‌రించారు. ప్రైవేట్ భాగాల్లో ఏదైనా బ‌ల‌వంతంగా ప్ర‌వేశ‌పెడితే దానిని అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకువ‌చ్చారు. 

సెక్టార్ 39 స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ రాజీవ్ కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ బాధిత బాలిక తన సంరక్షకుడితో కలిసి ఇక్కడ నివసిస్తోంది. అతడు నిందితుడికి సుమారు 20 సంవత్సరాలుగా స్నేహితుడు. ఈ కేసులో సంరక్షకుడు ఫిర్యాదు చేసాడు. ’’ అని చెప్పారు. అతడిని అరెస్టు చేసిన తరువాత స్థానిక కోర్టులో హాజరుపరిచామని అన్నారు. 

Maharashtra: తక్కువంచనా వేయకండి.. బాబ్రీలాంటి మీ సర్కారు కూల్చివేస్తాం.. హీటెక్కిన మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు

భారతదేశంలో ఇప్పుడు ఎవరైనా డిజిటల్ రేప్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వ‌చ్చిన‌ట్ల‌యితే నిందితుల‌పై విస్తృతమైన‌ IPC సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేస్తారు. కానీ డిజిటల్ రేప్ కేసుల్లో నేరారోపణలు, శిక్ష‌లు విధించ‌డం ఇప్పటికీ దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios