Asianet News TeluguAsianet News Telugu

హరప్పా నాగరికతకు సజీవ సాక్ష్యం.. గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో గుర్తింపు

గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో గుర్తింపు దక్కింది. హరప్పా నాగరికత విలసిల్లన పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెందింది. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

dholavira harappan era city in gujarat inscribed on unesco world heritage list ksp
Author
Dholavira, First Published Jul 27, 2021, 4:35 PM IST

భారతదేశంలో మరో ప్రఖ్యాత ప్రదేశానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో గుర్తింపు దక్కింది. హరప్పా నాగరికత విలసిల్లన పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెంది. క్రీస్తూ పూర్వం 1800లలో ఈ పట్టణాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ మేరకు ప్రపంచ వారసత్వ జాబితాలో ధోలవిరాను చేర్చినట్లు యునెస్కో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

ధోలవిరా.. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఉంది. 5 వేల ఏళ్లకు పూర్వం ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నగర జీవనం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. 1967-68లో జేపీ జోషీ నేతృత్వంలోని పురావస్తు శాఖ బృందం ఈ ప్రాంతాన్ని గుర్తించింది. హరప్పా నాగరికతలోని ఎనిమిది ప్రముఖ ప్రాంతాల్లో ధోలవిరా ఐదో అతిపెద్దది కావడం విశేషం.   

Also Read:రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం.. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు

ఇక గత ఆదివారం తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ తర్వాత రెండు రోజులకే మరో భారతీయ పర్యాటక ప్రాంతానికి యునెస్కో గుర్తింపు దక్కడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios