Asianet News TeluguAsianet News Telugu

DGCA: "భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.. సురక్షిత‌మే" 

DGCA: దేశీయ విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల వల్ల విధ్వంసం సంభ‌వించే అవ‌కాశం లేద‌నీ, భార‌త దేశ విమాన‌యాన రంగం సుర‌క్షిత‌మేన‌ని DGCA చీఫ్ అరుణ్ కుమార్ తెలిపారు. 

DGCA chief says Indian aviation sector absolutely safe
Author
Hyderabad, First Published Jul 31, 2022, 2:08 PM IST

DGCA: గ‌త కొంత కాలంగా అనేక దేశీయ విమానాల్లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయి. దీంతో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేయ‌డం లేదా ఆ విమాన సేవ‌ల‌ను ర‌ద్దు చేయ‌డం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ నేప‌థ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చీఫ్ అరుణ్ కుమార్ స్పందించారు. 

దేశీయ విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న సాంకేతిక లోపాల సమస్యల వ‌ల్ల కలిగించే అవకాశం లేదని, భారత విమానయాన రంగం సురక్షితమ‌ని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. విదేశీ విమానయాన సంస్థలు కూడా.. ఈలాంటి సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాయ‌ని తెలిపారు. భారతీయ విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు వ‌ల్ల‌ పెద్ద ప్రమాదాన్ని ఊహించలేమ‌ని అన్నారు.  

DGCA చీఫ్ అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత 16 రోజులలో భారతదేశానికి వచ్చే విదేశీ విమానయాన సంస్థ విమానాలు కూడా 15 సార్లు సాంకేతిక లోపాలను ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వివ‌ర‌ణ చేసిన‌ట్టు తెలిపారు. ఇందులో విమానాలలో తలెత్తడానికి గ‌ల‌ సాంకేతిక లోపాలు, అత్యవసర ల్యాండింగ్ గ‌ల కార‌ణాల ద‌ర్యాప్తు చేసిన‌ట్టు తెలిపారు. 

తాజాగా అస్సాంలోని జోర్హాట్‌లో 

ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ 6E-757 అస్సాంలోని జోర్హాట్ నుండి కోల్‌కతాకు వెళుతుండగా, టేకాఫ్ అవుతున్నప్పుడు రన్‌వే నుండి జారిపోయింది. ఆ విమాన‌ చక్రాలు బురద నేలలో ఇరుక్కుపోయాయి. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన పైలట్ వెంటనే  అప్ర‌మ‌త్త‌మై.. విమానాన్ని ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని పరీక్షించడానికి తీసుకెళ్లినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానాల‌తో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. 

స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మూడు రోజుల క్రితం ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ 50 శాతం విమానాలను ఎనిమిది వారాల పాటు నిషేధించింది. ఇది కాకుండా, ఇండిగో, గో ఫస్ట్, విస్తారా యొక్క అనేక దేశీయ, అంతర్జాతీయ విమానాలు నిరంతరం అనేక సాంకేతిక లోపాలను బహిర్గతం అవుతున్నాయి.

ప్రయాణీకుల భద్రతకు ప్రధానం

ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం అన్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. డీజీసీఏ చర్యలు కొనసాగతాయ‌ని అన్నారు.

త‌ప్పిన పెను ప్ర‌మాదాలు

జూలై నెల‌లో తొమ్మిది సార్లు విమానాల్లో సాంకేతిక లోపాలు త‌లెత్తాయి. దీంతో విమానాల‌ను ర‌ద్దు చేయ‌డం, ఆ సేవ‌ల‌ను ర‌ద్దు చేయడం చేశారు. 

జూలై 27: పదే పదే ఫిర్యాదులు రావడంతో DGCA 50% స్పైస్‌జెట్ విమానాలను నిషేధించింది

జూలై 19: ముంబై నుండి లేహ్ వెళ్తున్న GoFirst విమానంలోనూ, శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న GoFirst విమానంలో ఇంజిన్ లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ఆ విమానాల‌ను ర‌ద్దు చేశారు. 

జూలై 17: ఇండిగోకు చెందిన షార్జా-హైదరాబాద్ విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ చేయ‌బ‌డింది. 
 
జూలై 15: కొచ్చి-బహ్రెయిన్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం యొక్క కాక్‌పిట్‌లో చిన్న పక్షి దూరింది. 
 
జూలై 14: ఇంజన్ లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ఇండిగో చెందిన ఢిల్లీ-బరోడా విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. అక్కడ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు.  

జూలై 05: స్పైస్‌జెట్ చెందిన‌ ఢిల్లీ-దుబాయ్ విమానం యొక్క ఇంధన సూచిక విఫలమైంది

జూలై 05: స్పైస్‌జెట్‌కి చెందిన కాండ్లా-ముంబై విమానంలో 23,000 అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌ పగిలిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

జూలై 05: ఇండిగోకు చెందిన రాయ్‌పూర్-ఇండోర్ విమానం ల్యాండ్ అయిన తర్వాత పొగలు వచ్చాయి.

జూలై 05: విస్తారాకు చెందిన బ్యాంకాక్-ఢిల్లీ విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అయింది, దీంతో ఆ విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండ్ చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios