తమ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమని, అది అంత తొందరగా విడిపోదని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉద్దేశించి అన్నారు. తాము 15 ఏళ్లుగా స్నేహితులం అని చెప్పారు. 

మహారాష్ట్రలో శివసేన (షిండే వర్గం), బీజేపీ మధ్య విబేధాలు వచ్చాయని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. షిండే ప్రజాదరణను ప్రశంసిస్తూ శివసేన ఇచ్చిన ప్రకటన వల్ల మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాషాయ మిత్రపక్షాల మధ్య వివాదం మొదలైంది. అయితే ఇదంతా అబద్దమని, తాము ఐక్యంగానే ఉన్నామని సీఎం షిండే చెప్పారు. షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ఓ వేధికపైనే ఉన్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇరువురి నేతల మధ్య ఉన్న సుధీర్ఘ స్నేహం గురించి మాట్లాడుతూ.. ‘‘యే ఫెవికాల్ కా జోద్ హై, తుటేగా నహీ (ఇది ఫెవికోల్ జిగురు, ఇది విచ్ఛిన్నం కాదు). ఎంత ప్రయత్నించినా ఫర్వాలేదు. తమ స్నేహాన్ని ‘జై వీరూ కీ జోడీ లేదా ధరమ్ వీర్ జోడీ’ అని ప్రజలు అభివర్ణించారని సీఎం అన్నారు. శివసేన-బీజేపీ ప్రభుత్వం అంత బలహీనంగా లేదని అన్నారు. అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఒక ప్రకటన లేదా మరొకరు ఇంకేమో అనడం వల్ల షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఏమీ జరగదని ధీమా వ్యక్తం చేశారు. షిండేను మహారాష్ట్ర పాపులర్ సీఎంగా అభివర్ణించారు.

బిపార్జోయ్ తో గుజరాత్ అతలాకుతలం.. 4 రోజుల చిన్నారిని ఎత్తుకొని సురక్షితంగా తరలించిన మహిళా పోలీసు.. వైరల్

‘ఏ యాడ్ వల్ల మా మధ్య దూరం పెరగలేదు. ఇది పాత ప్రభుత్వం కాదు. ఎవరు ముందు మాట్లాడాలనే విషయంలో ఒకరి కాలర్ మరొకరు పట్టుకోవడం చూశాం. ఈ ప్రభుత్వం సామాన్యుల కోసం పనిచేస్తుంది. నిన్న, నేడు కలిసి ప్రయాణం చేశాం. రేపు కూడా కలిసి ప్రయాణం చేస్తాం. ఎందుకంటే కుర్చీలు దక్కించుకునేందుకు, పదవులు దక్కించుకునేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. సామాన్య ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక మార్పులు వచ్చేలా దీన్ని ఏర్పాటు చేశాం.’’ అని అన్నారు.

ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. ఫడ్నవీస్ తో తన స్నేహం 15-20 ఏళ్ల నాటిదని అన్నారు. ‘‘ఇది హృదయపూర్వక స్నేహం. మా మధ్య బలమైన బంధం ఉంది... అది కుర్చీ కోసమో, స్వార్థం కోసమో కాదు. స్వార్థంతో ఏకమైన వారిని సామాన్యులు పక్కన పెట్టారు’’ అని తెలిపారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని గత మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మాదిరిగా.. తమ ప్రభుత్వం ఫేస్ బుక్ ద్వారా పని చేసేది కాదని అన్నారు. తమ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని, యాక్షన్ మోడ్ లో ఉందన్నారు. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకురావడానికి మన ప్రధాని కృషి చేశారని కొనియాడారు.

సెంథిల్ బాలాజీ శాఖలను తొలగించాలని సిఫార్సు చేసిన తమిళనాడు సీఎం.. తిరస్కరించిన గవర్నర్ ఆర్ఎన్ రవి..

‘‘దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పాపులారిటీలో నెం.1గా ఉంది. మాకు కుర్చీ, అధికారం అంటే ఇష్టం లేదు. దేవేంద్ర ఫడ్నవీస్, నేను నిన్నమొన్నటి వరకు కార్మికులుగా పనిచేశాం, ఈ రోజు కూడా కార్మికులుగా పనిచేస్తున్నాం, రేపు కార్మికులుగా కొనసాగుతాం. అధికారం మా నెత్తిన పడదు. కాళ్లు నేలపైనే ఉన్నాయి కాబట్టి రాత్రింబవళ్లు పనిచేస్తూ వీధుల్లో తిరుగుతూ, ప్రాజెక్టులను సందర్శిస్తున్నాం. ఇంట్లో కూర్చొని ఆదేశాలు ఇచ్చే ప్రభుత్వం మాది కాదు’’ అని అన్నారు. కాగా.. పాల్ఘర్ లో జరిగిన ‘శసాన్ ఆప్లియా దారీ’ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. షిండే, ఫడ్నవిస్ ఒకే హెలికాఫ్టర్ లో పాల్ఘర్ కు వెళ్లారు,

సెంథిల్ బాలాజీ శాఖలను తొలగించాలని సిఫార్సు చేసిన తమిళనాడు సీఎం.. తిరస్కరించిన గవర్నర్ ఆర్ఎన్ రవి..

ప్రధాని మోడీ, సీఎం షిండే ఫొటోతో శివసేన మంగళవారం పలు పత్రికలకు యాడ్స్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. 26.1 శాతం మంది ప్రజలు షిండేను సీఎంగా, 23.2 శాతం మంది ఫడ్నవీస్ ను ఎంచుకున్నారని అందులో పేర్కొన్నారు. ‘ఇండియాకు మోడీ, మహారాష్ట్రకు షిండే’ అని అందులో ఉంది. అయితే దీని పట్ల బీజేపీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనికి డ్యామేజ్ కంట్రోల్ మోడ్ లో శివసేన బుధవారం కొత్త ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ఫడ్నవీస్, షిండే కలిసిన ఫొటో ఉంది.