బిపార్జోయ్ తుఫాను ప్రభావం గుజరాత్ పై తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు ఈ తుఫాను వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా ఓ 4 రోజుల పసికందును మహిళా పోలీసు ఆఫీసర్ ఎత్తుకొని, సురక్షిత ప్రాంతానికి తరలించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
బిపార్జోయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్ అతలాకులంగా మారింది. ఈ తుఫాను రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. దీంతో సముద్రతీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు, పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో తుఫాను ప్రభావిత ప్రాంతం నుంచి ఓ పసికందును అక్కడి మహిళా పోలీసు చేతిలో ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెంథిల్ బాలాజీ శాఖలను తొలగించాలని సిఫార్సు చేసిన తమిళనాడు సీఎం.. తిరస్కరించిన గవర్నర్ ఆర్ఎన్ రవి..
తుఫాను నేపథ్యంలో బర్దా దుంగార్ లో నాలుగు రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను స్థానిక న్యూస్ ఛానెల్ రికార్డు చేసింది. దీనిని గుజరాత్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ములు అయార్ బెరా ట్వీట్ చేశారు. అందులో ఓ మహిళా పోలీసు అధికారి నవజాత శిశువును చేతుల్లోకి తీసుకువెళ్తోంది. ఆ శిశువు తల్లితో పాటు అనేక మంది మహిళలు సురక్షిత ప్రాంతాలకు నడుచుకుంటూ వెళుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో భన్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బెరా ‘‘ఈ సర్వీస్ ద్వారా భద్రతను నిర్ధారించడానికి భన్వాడ్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది’’ అని వీడియోతో క్యాప్షన్ పెట్టారు.
If you are with #GujaratPolice, you are in absolutely safe hands. @CMOGuj@sanghaviharsh@GujaratPolicehttps://t.co/EodeDt6iPD
— DGP Gujarat (@dgpgujarat) June 15, 2023
గుజరాత్ డీజీపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ ‘మీరు గుజరాత్ పోలీసులతో ఉంటే, మీరు పూర్తిగా సురక్షితమైన చేతుల్లో ఉన్నారని అర్థం’’ అని పేర్కొంది. కాగా.. గుజరాత్ లో బిపార్జోయ్ తుఫాను గురువారం నుంచి తన ప్రతాపం చూపడం మొదలుపెట్టింది. ఈ తుఫాను ప్రభావం వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలడంతో ఇద్దరు మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు. ఈ తుఫాను నేటి సాయంత్రానికి రాజస్థాన్ లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
గాలుల వేగం గంటకు 80-85 కిలోమీటర్లకు పడిపోయిందని, ఇది ఇప్పటికీ చాలా బలంగా ఉందని, బలహీనపడటం నెమ్మదిగా జరుగుతుందని ప్రైవేట్ అంచనా సంస్థ స్కైమర్ తెలిపింది. బిపర్జోయ్ తుఫాను తీవ్రత తీరం దాటిన తర్వాత 'చాలా తీవ్రమైన' కేటగిరీ నుంచి 'తీవ్రమైన' కేటగిరీకి తగ్గిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.
