Asianet News TeluguAsianet News Telugu

జూన్ 22-24 వరకు జారీ చేసిన ఉత్తర్వుల వివ‌రాలివ్వండి - ఎంవీఏ ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ లేఖ‌

జూన్ 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య మహారాష్ట్ర ఎంవీఏ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, ఉత్తర్వుల వివరాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్ కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. 

Details of Orders Issued June 22-24 - Governor's letter to the MVA Government
Author
Mumbai, First Published Jun 28, 2022, 1:01 PM IST

మ‌హారాష్ట్రలో రాజ‌కీయ గంద‌ర‌గోళం ఇంకా కొన‌సాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహ‌తి క్యాంపులోనే ఉన్నారు. ఎంవీఏ నాయ‌కుల‌కు, తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ వివాదం ఇప్పట్లో స‌మిసిపోయేలా క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల మ‌ధ్య మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్వారీ ఎంవీఏ ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. జూన్ 22-24 తేదీల మధ్య ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆ లేఖ‌లో ఆయ‌న కోరారు. 

అక్కడ పానీపూరీపై నిషేధం.. ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తొంద‌ర పాటు నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని ఆరోపిస్తూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ప్ర‌వీణ్ దారేకర్ గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఈ లేఖ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఆర్‌లు, సర్క్యులర్‌లు అలాగే ప్ర‌భుత్వ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, చ‌ర్చ‌లు వాటి సారాంశం స‌మాచారాన్ని పూర్తిగా తన ముందు ఉంచాల‌ని ఆర్టికల్ 167 ప్రకారం గ‌వ‌ర్న‌ర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరినట్లు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. 

దారుణం.. బీఎస్సీ స్టూడెంట్ బ‌ట్ట‌లిప్పి చిత‌క‌బాదిన బీజేపీ నాయ‌కురాలి భ‌ర్త‌.. వీడియో వైర‌ల్

కాగా ప్ర‌భుత్వంలోని మిత్రపక్షాలు ఎన్ సీపీ, కాంగ్రెస్‌ల నియంత్రణలో ఉన్న శాఖల్లో వివిధ అభివృద్ధి ప‌నుల కోసం జూన్ 22-24 నుండి వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా మ‌హారాష్ట్రలోని శివ‌సేన రెండు గ్రూపుల మ‌ధ్య పోరు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరుకుంది. జూన్ 27వ తేదీ సోమ‌వారం సాయంత్రంలోగా స‌మాధానం ఇవ్వాల‌ని 15 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు డిప్యూటీ స్పీక‌ర్ జారీ చేసిన నోటీసుపై సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. అన‌ర్హ‌త నోటీసుపై జూలై 12 తేదీ సాయంత్రం 5.30 గంట‌ల లోపు స‌మాధానం ఇవ్వాల‌ని పేర్కొంది. 

అత్త మామలను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు.. నాగ్ పూర్ లో ఘ‌ట‌న

న్యాయమూర్తులు సూర్యకాంత్, జేబీ పార్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం తన ఉత్తర్వులో అనర్హ‌త ఎమ్మెల్యేల‌కు డిప్యూటీ స్పీక‌ర్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను పొడ‌గించింది. జూలై 12వ తేదీ వ‌ర‌కు పిటిషనర్లు లేదా ఇతర ఎమ్మెల్యేలు తమ హక్కులకు భంగం కలగకుండా తమ సమాధానాన్ని సమర్పించే స్వేచ్ఛ ఉంటుంద‌ని ధ‌ర్మాసనం పొడ‌గించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios