Asianet News TeluguAsianet News Telugu

అత్త మామలను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు.. నాగ్ పూర్ లో ఘ‌ట‌న

ఆస్తి వివాదంలో అత్తమామలను ఓ అల్లుడు నరికి చంపిన ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. నిందితుడు పెళ్లి అయిన నాటి నుంచి అత్తమామల ఇంట్లోనే ఉంటున్నాడు. శనివారం రాత్రి ఆస్తి వివాదంలో జరిగిన అల్లుడు కోపంతో కుటుంబ సభ్యులపై గొడ్డలితో దాడి చేశాడు. 

The son-in-law who chopped his aunt and uncle to death with an ax .. Ghataina in Nagpur
Author
Nagpur, First Published Jun 28, 2022, 10:03 AM IST

అత‌డికి దాదాపు 9 ఏళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది. పెళ్లి అయిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న అత్త‌గారింట్లోనే ఉంటున్నాడు. డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఇటీవ‌ల అత్త‌మామ‌ల‌కు, అల్లుడికి మ‌ధ్య కొంత మ‌న‌స్ప‌ర్థలు వ‌చ్చాయి. దీంతో ఆస్తి విష‌యంలో గొడ‌వలు జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా ఆస్తి విష‌యంలో మ‌ళ్లీ గొడ‌వ జ‌ర‌గ‌డంతో అత్తమామ‌ల‌ను అల్లుడు న‌రికి చంపేశాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో సంచ‌ల‌నం సృష్టించింది. 

మతసామర్యం దెబ్బతీసేలా పోస్టులు: ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు జుబేర్ అరెస్ట్

మ‌హారాష్ట్ర నాగ్‌పూర్‌లోని అమర్ నగర్ ప్రాంతంలో ఆస్తి వివాదంలో ఓ వ్యక్తి తన అత్తమామలను నరికి చంపార‌ని, అత‌డి భార్య, కుమార్తెను కూడా తీవ్రంగా గాయ‌ప‌ర్చిన‌ట్లు పోలీసులు శ‌నివారం తెలిపారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిందితుడు న‌ర్ము సీతా యాద‌వ్ బ‌స్సు డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. 2013లో క‌ల్ప‌నతో అత‌డికి వివాహం అయ్యింది. అప్ప‌టి నుంచి త‌న అత్త‌మామ‌ల ఇంట్లోనే ఉంటున్నాడు. కొంత కాలం నుంచి అతడు మద్యానికి బానిస అయ్యాడు. దీంతో తరచూ ఇంట్లో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. 

జాలరి పంట పండింది.. 55 కిలోల చేప పడింది.. వేలంలో రూ. 13 లక్షలకు విక్రయం

న‌ర్ము సీతారామ్ మామ భ‌గ‌వాన్ రావ‌రే కు 50 మేక‌లు ఉన్నాయి. అలాగే పాల వ్యాపారం చేస్తాడు. అయితే ఇటీవ‌ల ఆ మేక‌ల‌ను అమ్మేశాడు. దీంతో కొంత డ‌బ్బు వ‌చ్చింది. ఈ పరిణామాల‌ను గ‌మ‌నించిన సీతారామ్ ఆ డ‌బ్బులు, వారంద‌రూ ఉంటున్న రెండంత‌స్తుల బిల్డింగ్ త‌న‌కు ఇవ్వాల‌ని ఒత్తిడి చేశాడు. దీంతో శ‌నివారం రాత్రి గొడ‌వ జ‌రిగింది. ఇది తీవ్రంగా మారింది. దీంతో ముందుగా భార్య క‌ల్ప‌నను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. త‌రువాత భార్య, అత్త పుష్ప రావరే, కుమార్తె ముస్కాన్, మామ భగవాన్ రావరే పై గొడ్డ‌లితో దాడి చేశాడు. దీంతో వారంద‌రికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ స‌మ‌యంలో నిందితుడి 8 ఏళ్ల కుమారుడు మ‌రో గ‌దిలో నిద్రిస్తున్నాడు. దీంతో అత‌డికి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. 

మన దేశంలో 2030 కల్లా గిగ్ ఎకానమీ 2.35 కోట్ల ఉద్యోగాలు కల్పించనుంది: నీతి ఆయోగ్ నివేదిక

బాధితుల అరుపులు విని చుట్టుప‌క్క‌ల వారు అక్క‌డికి చేరుకున్నాడు. దీంతో అత‌డు పారిపోవాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ అతడిని స్థానికులు అడ్డుకోవ‌డంతో వారిపై కూడా దాడి చేసేందుకు సిద్దం అయ్యాడు. వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను వారంతా హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. అయితే అత్త‌మామ‌లు మార్గ మ‌ధ్యలోనే ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించారు. భార్య, కూతురు ప్ర‌స్తుతం హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios