Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. బీఎస్సీ స్టూడెంట్ బ‌ట్ట‌లిప్పి చిత‌క‌బాదిన బీజేపీ నాయ‌కురాలి భ‌ర్త‌.. వీడియో వైర‌ల్

బీఎస్సీ అగ్రికల్చర్ చదివే 23 ఏళ్ల యువకుడిని బీజేపీ నాయకురాలి భర్త చితకబాదాడు. ఆ యువకుడి బట్టలు విప్పించి మరీ కొట్టించాడు. యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

BJP leader's husband beaten up by BSc student .. Video goes viral
Author
Lucknow, First Published Jun 28, 2022, 11:15 AM IST

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వ‌చ్చింది. మెయిన్ పురి జిల్లా బీజేపీ నాయ‌కురాలి భ‌ర్త బీఎస్సీ చ‌ద‌వే యువ‌కుడిని బట్ట‌లూడ‌దీసి చిత‌క‌బాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడిని సంజీవ్ యాదవ్‌గా గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ ఘటన జ‌రిగిన‌ట్టు ఆ వీడియోలో స్ప‌ష్టం అవుతోంది. కానీ అది ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Maharashtra Political Crisis: రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ.. టాప్ 5 పాయింట్స్ ఇవే

ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నిందితుడు సంజీవ్ యాదవ్‌పై చర్య తీసుకోవాలని బాధితుడి ప‌క్షాన బ్రాహ‌ణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ సంఘానికి  చెందిన వ్య‌క్తులు నిర‌స‌న‌కు దిగారు. సంజీవ్ యాదవ్‌పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బ్రాహ్మణ సంఘం నాయ‌కుడు అశుతోష్ మిశ్రా హెచ్చ‌రించారు. 

జాలరి పంట పండింది.. 55 కిలోల చేప పడింది.. వేలంలో రూ. 13 లక్షలకు విక్రయం

అయితే ఈ వీడియోలో క‌నిపిస్తున్న బాధితుడిని 23 ఏళ్ల శశాంక్ చతుర్వేదిగా గుర్తించారు. ఇటావాలోని చౌదరి చరణ్ సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో BSc అగ్రిక‌ల్చ‌ర్ చ‌దువుతున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీన త‌న‌ను కొంద‌రు వ్య‌క్తులు కిడ్నాప్ చేశార‌ని, ఆ స‌మ‌యంలో వారంద‌రూ ముఖం క‌నిపించ‌కుండా మాస్క్ లు ధ‌రించారని చెప్పాడు. త‌న బ‌ట్ట‌లు విప్పేసి మ‌రీ కొట్టార‌ని బాధితుడు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని మెయిన్‌పురి ఎస్పీ కమలేష్ దీక్షిత్ తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios