న్యూఢిల్లీ: ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానమంత్రి మోడీ కోరారు.

 

ఢిల్లీలో చోటు చేసుకొన్న అల్లర్లపై  ప్రధానమంత్రి  మోడీ బుధవారం నాడు ట్వీట్ చేశారు. ఢిల్లీలో చోటు చేసుకొన్న అల్లర్లలో సుమారు 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

 

Also read:ఢిల్లీ అల్లర్ల వెనక కుట్ర, అమిత్ షా రాజీనామా చేయాలి: సోనియా గాంధీ

ఢిల్లీలో చోటు చేసుకొన్న అల్లర్లపై సమీక్షలు నిర్వహించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని  మోడీ చెప్పారు.  అన్ని వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని మోడీ కోరారు.