Asianet News TeluguAsianet News Telugu

ఓ తాతగారూ మీరింకా వున్నారా? : కాంగ్రెస్ నేత వీహెచ్‌పై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. కాంగ్రెస్ నేత వీ హనుమంతరావుపై ట్విట్టర్‌ వేదికగా సెటైర్‌ వేశారు. ‘‘ఓ తాతగారూ మీరింకా వున్నారా?’’ అంటూ తనదైన శైలిలో వీహెచ్‌పై విరుచుకుపడ్డారు.

Director Ram Gopal varma sensational comments ON v hanumantha rao ksm
Author
First Published Mar 19, 2023, 10:37 AM IST

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. కాంగ్రెస్ నేత వీ హనుమంతరావుపై ట్విట్టర్‌ వేదికగా సెటైర్‌ వేశారు. ‘‘ఓ తాతగారూ మీరింకా వున్నారా?’’ అంటూ తనదైన శైలిలో వీహెచ్‌పై విరుచుకుపడ్డారు. అసలేం జరిగిందంటే.. రామ్‌గోపాల్ వర్మ ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆర్జీవీ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపాయి. ఆర్జీవీ వ్యాఖ్యలను తప్పుబట్టిన పలువురు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఆర్జీవీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వీహెచ్.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఆర్జీవీ కామెంట్స్‌పై వీహెచ్ మాట్లాడుతూ.. నాగార్జున యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జీవీ మహిళలను ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. సినీ పరిశ్రమ కూడా ఇప్పటి వరకు ఆయన వ్యాఖ్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలానే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

 


రంభ, ఊర్వశిలు స్వర్గంలో లేరని చెబుతూ జీవితాన్ని ఆస్వాదించమని రాంగోపాల్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారని వీహెచ్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వర్మ  మహిళలను అవమానించారని, కించపరిచారని మండిపడ్డారు.. ‘‘వర్మకు ప్రొఫెసర్‌ కంటే ఎక్కువ జ్ఞానం ఉందని నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ రాజశేఖర్‌ అన్నారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేలా వైస్‌ ఛాన్సలర్‌ విద్యార్థులను రెచ్చగొట్టారు’’ అని వీహెచ్ చెప్పారు.  టాడా యాక్ట్ కింద ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

వర్మకు నిజంగా దమ్ముంటే కాకతీయ యూనివర్సిటీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని వీహెచ్ సవాలు విసిరారు. నాగార్జున వర్సిటీ వైస్ చాన్సలర్‌ను సస్పెండ్ చేసి వర్మపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

అయితే వీహెచ్ కామెంట్స్‌పై స్పందించిన ఆర్జీవీ.. ‘‘ఓ తాతగారూ మీరింకా వున్నారా??? NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకొండి’’ అంటూ ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios