Asianet News TeluguAsianet News Telugu

నేడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎన్నికలు.. ఆప్, బీజేపీ మధ్యే పోటీ..

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు నేడు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దాదాపు 250 వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. 

Delhi Municipal Corporation Corporation Election today.. Competition between AAP and BJP..
Author
First Published Dec 4, 2022, 9:41 AM IST

దేశ రాజధానిలో అత్యంత కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి నేడు జరుగుతున్నాయి. మే లో మూడు పౌర సంస్థలు విలీనమైన తర్వాత 250 వార్డులకు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో కూడా తన పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి గ్రేటర్ ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. వీటితో పాటు కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది.

భారత్ లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు.. పీవోకేను స్వాధీనం చేసుకోలేదు - పాక్ ఆర్మీ కొత్త చీఫ్ సయ్యద్ అసిమ్ మునీర్

ఈ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తంగా 13,638 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 68 మోడల్ పోలింగ్ స్టేషన్లు, మరో 68 పింక్ పోలింగ్ స్టేషన్లు ( ఈ పోలింగ్ స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బంది ఉంటారు. పాలిచ్చే తల్లులకు ఫీడింగ్ రూమ్, పిల్లల కోసం స్వింగ్‌లు, సెల్ఫీ బూత్ ఉంటాయి) ఏర్పాటు చేయబడ్డాయి.

చింతామణిలో ఘోరం... భార్యను లారీకింద తోసిచంపిన కసాయి భర్త

ఈ ఎన్నికల్లో 1.45 కోట్ల మంది ప్రజలు ఓటు వేయనున్నారు. ఇందులో  78,93,418 మంది పురుషులు, 66,10,879 మంది మహిళలు ఉండగా.. 1,061 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కాగా.. 95,458 మంది మొదటి సారిగా ఓటు వేయనున్నారు. ఢిల్లీలో 88,878 మందితో మయూర్ విహార్ ఫేజ్ అతి పెద్ద వార్డుగా నిలిచింది. త్రిలోక్‌పురి, సంగమ్ విహార్ 2,3 స్థానాల్లో ఉన్నాయి. 40,467 మంది నివాసితులతో కంఝవాలా అతి చిన్నగా వార్డు ఉంది.

పార్ల‌మెంట్ స‌మావేశాలు: నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుద‌ల స‌హా ప్రజా వ్య‌తిరేక విధానాల‌ను లేవ‌నెత్తనున్న కాంగ్రెస్

ఈ సారి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 1,349 మంది పోటీ చేస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య చాలా తగ్గింది. 2017 ఎన్నికలలో 2,538 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 492 మతపరమైన సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ ఎన్నికల కోసం 56,573 ఈవీఎంలను ఉపయోగించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios