Asianet News TeluguAsianet News Telugu

భారత్ లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు.. పీవోకేను స్వాధీనం చేసుకోలేదు - పాక్ ఆర్మీ కొత్త చీఫ్ సయ్యద్ అసిమ్ మునీర్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని, కానీ ఆ లక్ష్యం ఎప్పటికీ నెరవేరబోదని పాక్ ఆర్మీ కొత్త చీఫ్ సయ్యద్ అసిమ్ మునీర్ అన్నారు. తమ దేశాన్ని రక్షించుకునేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. 

Indias mission will never be fulfilled..PVK not taken over - Pak Army's new chief Syed Asim Munir
Author
First Published Dec 4, 2022, 9:00 AM IST

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యాన్ని భారత్ ఎప్పటికీ సాధించబోదని పాక్ ఆర్మీ కొత్త చీఫ్ సయ్యద్ అసిమ్ మునీర్ అన్నారు. ఒకవేళ దాడి జరిగితే తమ దేశాన్ని రక్షించుకునేందుకు పాక్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ పదవిని చేపట్టిన తరువాత రఖ్‌చిక్రి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) ను మొదటిసారి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని రక్షించడానికి మాత్రమే కాకుండా, తమపై జరిగే యుద్ధాన్ని తిరిగి శత్రువు వద్దకు తీసుకెళ్లడానికి పాకిస్తాన్ సాయుధ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని తాను స్పష్టం చేస్తున్నానని అన్నారు.

చింతామణిలో ఘోరం... భార్యను లారీకింద తోసిచంపిన కసాయి భర్త

దుస్సాహసానికి దారితీసే ఏదైనా అపోహను దృఢమైన దేశం మద్దతుతో తమసాయుధ దళాల పూర్తిగా ఎదుర్కొంటున్నాయని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి ఆదేశాలను అమలు చేయడానికి భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పిన కొద్ది రోజులకే మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనలను ‘‘అత్యంత బాధ్యతారాహిమైనవి’’అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన అభివర్ణించారు.

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్కూల్ టీచర్‌పై సస్పెన్షన్ వేటు

మునీర్ పర్యటన సందర్భంగా నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి తాజా పరిస్థితి, ఏర్పాటు కార్యాచరణ సంసిద్ధత గురించి కూడా మునీర్ కు సైనికాధికారులు ఆయనకు వివరించారు. సీఓఎఎస్ అధికారులు, సైనికులతో మునీర్ సంభాషించారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో నిర్వహిస్తున్న వారి నైతిక స్థైర్యం, వృత్తిపరమైన సామర్థ్యం, పోరాట సంసిద్ధతను ప్రశంసించారని పాక్ ఆర్మీ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

కాగా.. అక్టోబర్ 28వ తేదీన భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ కీలక ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అందులో పునరుద్ఘాటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios