Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరొకరు అరెస్ట్.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న సీబీఐ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరొకరికి అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేశారు.

Delhi Liquor scam case CBI arrests Hyderabad based businessman Boinapally Abhishek
Author
First Published Oct 10, 2022, 9:09 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరొకరికి అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేశారు. రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్లలో అభిషేక్ ఒకరు. ఈ ఏడాది జూలై 12న ఈ కంపెనీని స్థాపించారు. ఢిల్లీకి చెందిన జీఎన్‌సీడీటీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కొనసాగుతున్న విచారణలో అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

దక్షిణ భారతదేశంలోని కొంతమంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేస్తున్న అభిషేక్ బోయిన్‌పల్లిని ఆదివారం విచారణకు పిలిచినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్టుగా సీబీఐ గుర్తించిందని.. దీంతో గత రాత్రి అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. నిందితుడిని సంబంధిత కోర్టులో హాజరు పరచనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐకి ఇది రెండో అరెస్ట్. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌ను సీబీఐ అధికారులు ముంబైలో అరెస్టు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios