లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా పడింది. వచ్చే నెల 5వ తేదీన దీనిపై విచారణ జరుపుతామని ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

 ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో తలెత్తిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేసింది. తన క్లయింట్ బెయిల్ పిటిషన్ పై ఈడీ దాఖలు చేసిన సమాధానంపై స్పందించేందుకు సిసోడియా తరఫు న్యాయవాది సమయం కోరడంతో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ విచారణను వాయిదా వేశారు. దీనిపై వివరణాత్మక వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సిసోడియా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మోదీ, అదానీల మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. ఆ భయం ప్రధాని కళ్లలో చూశాను: రాహుల్

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కేసుకు సంబంధించి మార్చి 9 న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను తీహార్ జైలులో ఈడీ అరెస్టు చేసింది. 2021-22 సంవత్సరానికి ఇప్పుడు రద్దు అయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఫిబ్రవరి 26న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఈ నెల 31న తీర్పు వెలువరిస్తామని కోర్టు శుక్రవారం తెలిపింది.

Scroll to load tweet…

కాగా.. ఆప్ నేత మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల కిందట పొడిగించింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన కస్టడీ గడువు ఈ నెల 22వ తేదీతో ముగిసింది. దీంతో ఆయనను ఈడీ అధికారులు గత బుధవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.