ఢిల్లీలోని ఉమ్రావ్ జ్యువెలర్‌లో భారీ చోరీ జరిగింది. రూ.25కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. దీనికోసం టెర్రస్ మీదినుంచి దిగినట్టు పోలీసులు చెబుతున్నారు. 

న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని జంగ్‌పురాలోని నగల దుకాణంలోకి దొంగలు పడ్డారు. రూ. 20-25 కోట్ల విలువైన ఆభరణాలతో పరారయ్యారు. ఆదివారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం మధ్య భోగల్ ప్రాంతంలోని ఉమ్రావ్ జ్యువెలర్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ భారీ దోపిడీకి పక్కా ప్రణాళిక వేసుకున్న దొంగలు.. మొదటసీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేశారు. ఆ తరువాత స్ట్రాంగ్‌రూమ్ (లాకర్)లోకి రంధ్రం చేశారు.

నాలుగు అంతస్తుల భవనంలోని టెర్రస్‌పై నుంచి షాపు ఉన్న బిల్డింగ్ లోకి చొరబడ్డారు. ఆ తరువాత దొంగలు స్ట్రాంగ్‌రూమ్‌ ఉన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చేరుకున్నారని అధికారులు తెలిపారు. వచ్చిన తరువాత మొదట సీసీ టీవీ కెమెరా కనెక్షన్స్ ను కట్ చేశారు. ఆ తరువాత ఆభరణాలు ఉంచిన స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించడానికి దాని గోడకు రంధ్రం చేశారు. వాటిని దొంగిలించడమే కాకుండా షోరూమ్‌లో ఉంచిన నగలను కూడా తీసుకుని పరారయ్యారు.

గంజాయి అమ్ముతున్న డాగ్ ట్రైనర్.. పట్టుబడకుండా పోలీసు దుస్తుల్లో కనిపిస్తే దాడిచేసేలా కుక్కలకు ట్రైనింగ్..

ఆదివారం సాయంత్రం షోరూమ్‌కు తాళం వేసిన షోరూం యజమాని ఈ ఉదయం షోరూం తెరిచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. సోమవారం కూడా దుకాణం మూసి ఉంటుంది. దొంగలు సీసీటీవీని డిస్‌కనెక్ట్ చేసేకంటే ముందు సీసీటీవీలో రికార్డయిన ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.

నిన్న హర్యానాలోని అంబాలాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కోఆపరేటివ్ బ్యాంకులోకి చొరబడి నగలు, ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. బ్యాంకులోకి ప్రవేశించేందుకు గ్యాస్ కట్టర్‌తో గోడకు రంధ్రం చేసి 32 లాకర్లను తెరిచినట్లు పోలీసులు తెలిపారు. వారాంతాల్లో బ్యాంకు మూసి ఉండడంతో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.