న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో చాందినీ చౌక్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆల్కా లాంబా తన ప్రత్యర్థి కన్నా వెనుకంజలో ఉన్నారు. తొలుత ఆధిక్యంలో కొనసాగిన ఆమె తర్వాత వెనుకంజ వేశారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెసుకు మరోసారి నిరాశ ఎదురయ్యే పరిస్థితే ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెసు ఖాతా కూడా తెరవలేదు. కానీ, ఈసారి కాస్తా ఆశ కనిపిస్తోంది. ఒక్క సీటును గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్కా లంబా కారణంగా ఆ ఆశలు పొటమరిస్తున్నాయి.

ఢిల్లీలోని చాందినీ చౌక్ స్థానంలో అల్కా లంబా తన ప్రత్యర్థి కన్నా ముందంజలో ఉన్నారు. తొలి ఫలితాల్లో ఆమె ముందంజలో ఉన్నట్లు ఫలితాల సరళి తెలియజేస్తోంది.

Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2020: దూసుకుపోతున్న ఆప్

కాగా, ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడుతున్నాయి. ఢిల్లీలోని 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఫలితాల్లో దూసుకుపోతోంది. అయితే, గత ఎన్నికల్లో కన్నా సీట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి గత ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు 14 నుంచి 15 స్థానాల్లో ముందంజలో ఉంది.  

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు 21 కేంద్రాల్లో జరుగుతోంది. వీటిలో 11 జిల్లాల్లో 9 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 

Also Read: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్: ఆప్ ముందజ... పరవాలేదనిపిస్తున్న బిజెపి