ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఊడ్చేసిన కేజ్రీవాల్...బిజెపికి మరోసారి భంగపాటు

delhi elections results 2020: live updates

ఢిల్లీలోని మొత్తం 70 శాసనసభ స్థానాలకు గత శనివారం  పోలింగ్ జరగ్గా ఇవాళ(మంగళవారం)  ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో మరోసారి ఆప్ డిల్లీని ఊడ్చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సత్తా ఏమిటో మరోసారి బిజెపికి రుచిచూపించారు. ఇప్పటివరకు వెలువగడిన ఫలితాల ప్రకారం ఆప్ 63 స్థానాల్లో, బిజెపి 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్  కు మరోసారి ఖాళీ చేతులే  మిగిలాయి. 

3:55 PM IST

శీలంపూర్ లో 27,887 ఓట్ల మెజారిటీతో ఆప్ అభ్యర్థి విజయం

శీలంపూర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం  సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి అబ్దుల్ రహ్మాన్ బిజెపి అభ్యర్థి కౌశల్ కుమార్ మిశ్రాపై 27,887 ఓట్లు భారీ ఆధిక్యంతో విజయం సాధించాడు. 
 
3:45 PM IST

ఇది నా విజయం కాదు... మీ ఇంటి బిడ్డ విజయం..: కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీపై నమ్మకంతో మూడోసారి కూడా ఇంత గొప్ప విజయాన్ని అందిచిన డిల్లీ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు  తెలుపుతున్నానని ఆ  పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ పేర్కోన్నారు. ఫలితాల  అనంతరం ఆయన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తమ ఇంట్లో బిడ్డలాగ భావించి తనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరి విజయం ఇదని.. మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఇలాగే నిలబెట్టుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. 

3:30 PM IST

''మన్ కి బాత్'' కంటే ''జన్ కీ బాత్'' కీలకం...: డిల్లీ ఫలితంపై ఉద్దవ్ ఠాక్రే

డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ తో పాటే ఢిల్లీ ప్రజలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బిజెపిపై  మరీ ముఖ్యంగా ప్రధాని మోదీపై సెటైర్లు విసిరారు. '' దేశం జన్ కి బాత్ (ప్రజల మాటల)తో నడుస్తుంది కానీ మన్ కి బాత్( ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమం) తో కాదు'' అని ఎద్దేవా చేశారు. బిజెపి కేజ్రీవాల్ ను టెర్రరిస్ట్ అన్నా ఆ మాటలను ప్రజలు నమ్మలేరని.. అందువల్లే ఇంతగొప్ప విజయాన్ని అందించారని ఉద్దవ్ పేర్కోన్నారు. 

3:07 PM IST

రాజేంద్ర నగర్ లో ఆప్ ఘనవిజయం... 20వేల మెజారిటీ

ఆమ్ ఆద్మీ పార్టీ రాజేందర్ నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించిది. ఆ పార్టీ అభ్యర్థి రాఘవ్ చందా 20,058  ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్దే అతన్న భుజాలపై ఎత్తుకుని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... అరవింద్ కేజ్రీవాల్ దేశ ద్రోహి కాదు నిజమైన దేశభక్తుడని నమ్మారు కాబట్టే మరోసారి అతడికి  పట్టం కట్టారని అన్నారు. బిజెపి చేసేది కాదు కేజ్రీవాల్ చేసేది అసలైన దేశభక్తి. 

2:45 PM IST

ఉత్కంఠకు తెర... ఢిల్లీ డిప్యూటీ సీఎందే విజయం

ఉత్కంఠ పోరులో చివరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విజేతగా నిలిచారు. మొదటి నుండి బిజెపి అభ్యర్థి రవీందర్ సింగ్  నేగి గట్టి పోటీ ఇచ్చారు. ఓ దశలో అయితే వరుస రౌండ్లలో సిసోడియా వెనుకబడ్డారు. అయితే  చివర్లో పుంజుకున్న ఆయన 3400 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2:33 PM IST

వరుసగా ఐదో రాష్ట్రం... ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం: బిజెపి అభ్యర్థి

'' అద్భుత విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరియు అరవింద్ కేజ్రీవాల్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నా.ఈ ఓటమితో బిజెపి వరుసగా ఐదో రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. అంటే మేం ప్రజలకు దగ్గరవడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యాం.''  అని మోడల్ టౌన్ బిజెపి అభ్యర్థి కపిల్ మిశ్రా అభిప్రాయపడ్డాడు. 

2:20 PM IST

భార్యతో కలిసి కేజ్రీవాల్ సంబరాలు...ఆప్ గెలుపొక్కటే కాదు...

డిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అర్హత సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల్లో మరోసారి  బంపర్ మెజారిటీ సాధించి  హ్యాట్రిక్ విజయాన్ని అందుకోడానికి సిద్దంగా వున్నారు. ఈ క్రమంలో  భార్య సునీతతో కలిసి పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.  అయితే అవి కేవలం గెలుపు సంబరాలు మాత్రమే కాదు... ఇవాళ కేజ్రీవాల్ భార్య  పుట్టినరోజు. దీంతో ఆమెతో కేక్ కట్ చేయించి రెండు వేడుకలను ఒకేసారి జరుపుకున్నారు కేజ్రీవాల్. 
 
2:19 PM IST

స్వల్ప  ఆధిక్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. పట్పార్ గంజ్ నుండి పోటీచేస్తున్న ఆయనకు బిజెపి అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఇప్పటివరకు వెనుకంజలో వున్న సిసోడియా తాజాగా 656 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. 

2:04 PM IST

నా ఓటమికి కారణమదే: అల్కా లంబా

ఈ ఎన్నికల ఫలితం తనకు వ్యతిరేకంగా రావడానికి హిందూ-ముస్లీం ఓట్లు కేంద్రీకృతం అవ్వడమే కారణమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా.  ఈ రెండు వర్గాలు పూర్తిగా కేవలం రెండు  పార్టీలవైపే నిలిచారు. దీంతో తన ఓటమి తప్పలేదని... అయితే ఈ ఓటమిని తాను అంగీకరిస్తున్నానని అన్నారు.  
 
1:53 PM IST

ఆప్ విజయానికి కారణం అదికాకపోవచ్చు...ఇదే ఉదాహరణ: బిజెపి ఎంపీ

ఢిల్లీలో వెలువడిన ఎన్నికల  ఫలితాలను ఆమోదిస్తున్నామని బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ తెలిపారు. ఇప్పటికంటే  ఎక్కువ కష్టపడి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత  బలోపేతం చేసి  అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అయితే ఈ ఎన్నికల పలితానికి విద్య మరియు అభివృద్దే కారణమైతే విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఓటమిఅంచుల్లో నిలవడం ఏమిటని  ప్రశ్నించారు.  

1:35 PM IST

అరవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం... బంపర్ మెజారిటీతో

న్యూడిల్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన సీఎం కేజ్రీవాల్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 13,508 ఓట్ల ఆధిక్యంతో బిజెపి అభ్యర్ధి సునీల్ కుమార్ యాదవ్ పై విజయాన్ని అందుకున్నారు. 

1:27 PM IST

అమిత్ షా కు కరెంట్ షాక్...: ఆఫ్ అభ్యర్ధి అమానతుల్లా ఖాన్

ఓక్లా(షహీన్ బాగ్) నియోజకవర్గంలో రికార్డు విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్  అభ్యర్థి అమానతుల్లా ఖాన్ బిజెపిని విమర్శలు ఎక్కుపెట్టాడు. ఢిల్లీ ప్రజలు బిజెపికి, అమిత్ షాకి కరెంట్ షాక్ లాంటి ఫలితాన్ని ఇచ్చారు.  ఇది అలసత్వంపై అభివృద్ది సాధించిన విజయమని అన్నారు. ఈ రికార్డు విజయం నాది కాదు ఢిల్లీ  ప్రజలదేనని అమానతుల్లాఖాన్ పేర్కొన్నాడు. 
 
1:17 PM IST

అభినందనలు... ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ నే నమ్మారు.. :  ఎంపీ గంభీర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను తాము అంగీకరిస్తున్నామని బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపారు.  విజయం దిశగా సాగుతున్న ఆప్ కు, సీఎం కేజ్రీవాల్ కు, ఢిల్లీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి శక్తివంన  లేకుండా ప్రతిఒక్క బిజెపి నాయకుడు, కార్యకర్త కష్టపడ్డారు. అయితే ప్రజలకు తమపై నమ్మకాన్ని కలిగించలేకపోయాం. అరవింద్  కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీ మరింత అభివృద్ది చెందుతుందని అనుకుంటున్నట్లు గంభీర్ అభిప్రాయపడ్డారు. 

1:01 PM IST

కేజ్రీవాల్ కు ప్రశాంత్ కిషోర్ అభినందనలు

డిల్లీ  అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని  ఖాయం చేసుకున్న ఆప్ పార్టీకి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పొలిటికల్ స్ట్రాటేజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అభినందనలు తెలిపారు. ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్ ను స్వయంగా కలిసి ఆ అభినందనలు తెలిపారు. 

12:45 PM IST

కాంగ్రెస్ ఓటమిని ముందే ఊహించాం...: ఎంపీ సీఎం కమల్ నాథ్

డిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా ఘోర ఓటమిని చవిచూస్తుందని ముందే ఊహించాం. అయితే పెద్ద పెద్ద మాటలు  మాట్లాడే బిజెపి పరిస్థితి ఇంత ఘోరంగా ఓటమిపాలవడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యిందన్నారు. 

12:27 PM IST

కల్కజిలో హోరాహోరీ...25 ఓట్లతో బిజెపి లీడ్

కల్కజి నియోజకవర్గంలో బిజెపి-ఆప్ ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 10వ రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి ధరమ్ వీర్ సింగ్ ఆప్ అభ్యర్థి ఆతిషిపై కేవలం 25 ఓట్ల ఆధిక్యంతో వున్నారు. ధరమ్ వీర్ కు 20266 ఓట్లురాగా ఆతిషికి 20241 ఓట్లు వచ్చాయి. 

12:16 PM IST

ఘోర  పరాజయానికి బాధ్యత నాదే: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా  గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే మరింత తగ్గింది. ఈ ఫలితంపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ చోప్రా స్పందిస్తూ తానే దీనికి బాధ్యత వహిస్తానని అన్నారు. అయితే పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రదర్శనపై త్వరలో సమీక్షించుకుని ఈ ఘోర పరాభవం వెనకున్న కారణాలను అన్వేషిస్తామని అన్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను కూడా విశ్లేషించి కారణాలను కనుక్కుంటామని అన్నారు. 

11:56 AM IST

కేజ్రీవాల్ ప్రస్తుత ఆధిక్యం 6399

న్యూఢిల్లి నియోజకవర్గం నుండి ఆప్ తరపున పోటీచేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్  ఇప్పటివరకు 11,308 ఓట్లు  సాధించారు. ఆయన తర్వాత స్థానంలో బిజెపి అభ్యర్ధి సునీల్ కుమార్ యాదవ్ 4909 ఓట్లతో నిలిచాడు. కాంగ్రెస్ అభ్యర్థి రోమేష్ సబర్వాల్ 949  ఓట్లు మాత్రమే పొందాడు. 

11:38 AM IST

ఓట్ల శాతం తక్కువే... అసలు తేడా సీట్లలోనే

ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 52 శాతం ఓట్ షేర్ సాధించింది.  బిజెపి 39  శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కేవలం 4 శాతం ఓట్ షేర్ ను మాత్రమే సాధించింది. ఆప్-బిజెపిల మధ్య ఓటింగ్ శాతం  పరంగా తేడా తక్కువగానే వున్న సామాన్యుడి పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. 
 
11:18 AM IST

డిప్యూటీ సీఎం సిసోడియా భారీ ఓట్ల తేడాతో వెనుకంజ

ఆమ్ ఆద్మీ పార్టీ  అభ్యర్థి, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా భారీ ఓట్ల తేడాతో వెనుకంజలో  వున్నారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి ఆయన బిజెపి అభ్యర్థి రవి నేగి కంటే 1427 ఓట్లు  వెనుకబడి వున్నారు. 

11:10 AM IST

అసెంబ్లీ స్పీకర్ వెనుకంజ

డిల్లీ అసెంబ్లీ స్పీకర్,  షాహ్ దారా ఆప్ అభ్యర్థి  రామ్ నివాస్ గోయల్ వెనుకంజలో వున్నారు.  

11:05 AM IST

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా వెనుకంజ

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నా ఆ పార్టీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెనుకంజలోకి వెళ్లిపోయారు. పత్పార్ గంజ్ నుంచి పోటీచేస్తున్న అతడిపై బిజెపి అభ్యర్థి రవి  నేగి స్వల్ఫ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిసోడియా 4945 ఓట్లతో కొనసాగుతుండగా ప్రత్యర్థి రవి నేగి 4983 ఓట్లతో ఆధిక్యంలో నిలిచాడు. 

10:56 AM IST

ఆప్-బిజెపి ల మధ్య హోరాహోరీ... అత్యధిక స్థానాల్లో తేడా వెయ్యి ఓట్లే

డిల్లీలో ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఆప్, బిజెపిల మధ్యే ప్రదాన పోటీ వుంది. ఇరుపార్టీల మధ్య దాదాపు 27 స్థానాల్లో కేవలం 1000 ఓట్ల అంతరం మాత్రమే వుంది. దీంతో ఎప్పటికప్పుడు ఫలితాల సరళి మారుతోంది. 

10:49 AM IST

ఆప్ హ్యాట్రిక్ విజయం ముందే ఊహించా...కానీ కాంగ్రెస్...: ఎంపీ అభిరంజన్ చౌదరీ

ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి డిల్లీలో అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు కాంగ్రెస్ ఎంపీ అభిరంజన్ చౌదరి.  అయితే కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఓటమిపాలవ్వడం అనేది మంచి సంకేతం కాదు. ఆప్ సాధించిన ఈ విజయం బిజెపి పైనే కాదు ఆ పార్టీ కమ్యూనల్ ఎజెండాపైనే అని అభిరంజన్ పేర్కొన్నారు. 
 
10:40 AM IST

ఎలక్షన్స్ కమీషన్ అధికారిక లెక్కలు... ఆప్ స్ఫష్టమైన ఆధిక్యం

ఎలక్షన్ కమీషన్ అందించిన అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఆప్ 45, బిజెపి 19 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. 

10:31 AM IST

చాందినీచౌక్ లో ఆప్ భారీ ఆధిక్యం

చాందినీచౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధి పర్లాద్ సింగ్ సాహ్నీ 6043, కాంగ్రెస్ అభ్యర్ధి ఆల్కా లాంబా 157, బిజెపి 67  ఓట్లు సాధించాయి. 

10:23 AM IST

ఫలితం ఏదయినా... నేనే బాధ్యున్ని...: ఢిల్లీ బిజెపి చీఫ్

ఎన్నికల ఫలితాలు వెలువడటం ఇప్పుడే మొదలయ్యాయని... అయితే బిజెపి-ఆప్ ల మధ్య అంతరం వున్నట్లు అర్థమవుతోందన్నారు బిజెపి డిల్లీ అధ్యక్షులు మనోజ్ తివారి. అయితే ఇంకా సమయం వుంది కాబట్టి పూర్తి ఫలితాలు వెలువడేలోపు తాము పుంజుకుంటామని ఆశిస్తున్నా. అయితే ఫలితం ఏదయినా అందుకు పూర్తిగా తానే బాధ్యున్నని తివారి తెలిపారు. 

10:13 AM IST

ఢిల్లీ డిప్యూటీ సీఎం 112 ఓట్లతో ముందంజ

పత్పార్ గంజ్ నుండి పోటీచేసిన ఆప్ అభ్యర్ధి, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 112 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే మోడల్ టౌన్ నుండి  పోటీచేసిన బిజెపి అభ్యర్థి కపిల్ మిశ్రా 98 ఓట్ల ఆధిరక్యంలో కొనసాగుతున్నారు. 

9:59 AM IST

2026 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్

న్యూడిల్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి, సీఎం కేజ్రీవాల్ 2026 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే రోహిణి నియోజకవర్గం నుండి బిజెపి తరపున పోటీలో నిలిచిన విజేందర్ గుప్తా 1172 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

9:56 AM IST

బిజెపి అభ్యర్థి బగ్గా వెనుకంజ

హరినగర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధ తేజీందర్ పాల్ బగ్గా వెనుకంజలోకి వెళ్లాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి ఆప్ అభ్యర్ధి రాజ్ కుమారి దిల్లాన్ అతడిపై ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 

9:49 AM IST

మా పాలనకు ప్రజల మద్దతు... అందుకే ఈ ఫలితం: సౌరబ్

గ్రేటర్ కైలాష్ నుండి పోటీ చేస్తున్నఆప్ అభ్యర్ధి సౌరబ్ భరద్వాజ్ ప్రస్తుతం 1505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతు న్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ పాలనను ప్రజలు అంగీకరించారని... అందువల్లే మరోసారి పట్టం కట్టేందుకు సిద్దమయ్యారని అన్నారు. 
 
9:36 AM IST

పుంజుకుంటున్న బిజెపి

డిల్లీ ఎన్నికల  ఫలితాల్లో బిజెపి పార్టీ మెళ్లిగా పుంజుకుంటోంది. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీయే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నా బిజెపి ఆధిక్యం ఒక్కోటిగా పెరుగుతోంది.  ప్రస్తుతం ఆప్ 48 స్థానాల్లో, బిజెపి 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక్కచోట కూడా ఆధిక్యంలో లేదు. 
 
9:19 AM IST

మాజీ కేంద్ర మంత్రి వెనుకంజ

పటేల్ నగర్ లో మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీర్థ్ వెనుకంజలో వున్నారు. ఆమె ఇటీవలే బిజెపి ని వీడి కాంగ్రెస్ పార్టీలో  చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పటేల్ నగర్ నుండి పోటీకి దిగారు. 

9:09 AM IST

కాంగ్రెస్ అభ్యర్థి  ఆల్కా లాంబా  వెనుకంజ

ఇప్పటివకు ఆధిక్యంలో కొనసాగిన ఏకైక స్థానంలో కూడా కాంగ్రెస్ వెనకంజలోకి వెళ్లిపోయింది. చాందిన్ చౌక్ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్కా లాంబా రెండో స్థానానికి పడిపోయారు.  
 
9:04 AM IST

ఆప్ కార్యాలయం వద్ద సంబరాలు

డిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద  కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఫలితాల గురించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నట్లు  సమాచారం. 
 
8:59 AM IST

మంత్రి సౌరబ్ ముందంజ

గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో మంత్రి సౌరబ్ భరద్వాజ్ ముందంజలో వున్నారు. బిజెపి అభ్యర్థిని రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 
 
8:50 AM IST

అక్షర్ ధామ్ కౌటింగ్ కేంద్రలో డిప్యూటీ సీఎం

డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పట్పార్ గంజ్ నుండి ఆఫ్ అభ్యర్ధిగా పోటీలో వున్న విషయం తెలిసిందే. ఆయన అక్షర్ ధామ్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు  సరళిని పరిశీలిస్తున్నారు. ఇక్కడే బిజెపి అభ్యర్థి రవి నేగి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు.

8:43 AM IST

సీఎం కేజ్రీవాల్ ముందంజ

డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో వున్నారు. 

8:35 AM IST

డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా ముందంజ

ప్రతాప్ గంజ్ లో ఆప్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా ముందంజలో  ఉన్నారు. అలాగే రోహిణి నియోజకవర్గం లో బీజేపీ నేత విజయేంద్రకుమార్ ముందంజలో వున్నారు. 
 
8:31 AM IST

దూసుకుపోతున్న ఆప్...

ఆప్ ఆధిక్యం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ మెజారిటీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో వుంది. 45 స్థానాల్లో ఆప్, 11 స్థానాల్లో బిజెపి , ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది.  
 
8:27 AM IST

బిజెపి ఆధిక్యంలో కొనసాగుతున్న స్థానాలు

డిల్లీ కంటోన్మెంట్, ద్వారకా, జనక్ పురి, కృష్ణానగర్ లలో బిజెపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
8:25 AM IST

కాంగ్రెస్ కు ఊరట

చాందిని చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్ధి అల్కా లాంబా ఆప్, బిజెపి అభ్యర్ధులకంటే ప్రస్తుతం ముందంజలో వుంది. 
 
8:17 AM IST

కొనసాగుతున్న ఆప్ హవా

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్లే డిల్లీలో ఆప్ దూసుకుపోతోంది. ఫలితాల ప్రక్రియ మొదలవగానే ఆప్ 25 స్థానాల్లో ముందంజలోకి వెళ్లిపోయింది. బిజెపి  8, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో  వుంది.

8:13 AM IST

ఓట్ల లెక్కింపు ప్రారంభం

డిల్లీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయ్యింది. మహారాణి బాగ్ లో అధికారులు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 
   
12:14 AM IST

ఘోర  పరాజయానికి బాధ్యత నాదే: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా  గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే మరింత తగ్గింది. ఈ ఫలితంపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ చోప్రా స్పందిస్తూ తానే దీనికి బాధ్యత వహిస్తానని అన్నారు. అయితే పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రదర్శనపై త్వరలో సమీక్షించుకుని ఈ ఘోర పరాభవం వెనకున్న కారణాలను అన్వేషిస్తామని అన్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను కూడా విశ్లేషించి కారణాలను కనుక్కుంటామని అన్నారు. 

12:13 AM IST

12:04 AM IST

షహీన్ బాగ్ లో బిజెపి ముందంజ

ఓక్లా(షహీన్ బాగ్) నియోజవర్గంలో ఆప్-బిజెపిల మధ్య  పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. అయితే 8వ రౌండ్ ముగిసే సమయానికి  బిజెపి అభ్యర్థి మొత్తం 7107 ఓట్లు సాధించగా ఆప్ అభ్యర్ధికి 5,474 ఓట్లు వచ్చాయి. ఇలా ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ పై బిజెపి అభ్యర్థి  బ్రహమ్ సింగ్  1633 ఓట్ల ఆధిక్యంలో నిలిచాడు. 

3:55 PM IST:

శీలంపూర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం  సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి అబ్దుల్ రహ్మాన్ బిజెపి అభ్యర్థి కౌశల్ కుమార్ మిశ్రాపై 27,887 ఓట్లు భారీ ఆధిక్యంతో విజయం సాధించాడు. 
 
3:45 PM IST:

ఆమ్ ఆద్మీపై నమ్మకంతో మూడోసారి కూడా ఇంత గొప్ప విజయాన్ని అందిచిన డిల్లీ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు  తెలుపుతున్నానని ఆ  పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ పేర్కోన్నారు. ఫలితాల  అనంతరం ఆయన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తమ ఇంట్లో బిడ్డలాగ భావించి తనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరి విజయం ఇదని.. మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఇలాగే నిలబెట్టుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. 

3:31 PM IST:

డిల్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ తో పాటే ఢిల్లీ ప్రజలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బిజెపిపై  మరీ ముఖ్యంగా ప్రధాని మోదీపై సెటైర్లు విసిరారు. '' దేశం జన్ కి బాత్ (ప్రజల మాటల)తో నడుస్తుంది కానీ మన్ కి బాత్( ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమం) తో కాదు'' అని ఎద్దేవా చేశారు. బిజెపి కేజ్రీవాల్ ను టెర్రరిస్ట్ అన్నా ఆ మాటలను ప్రజలు నమ్మలేరని.. అందువల్లే ఇంతగొప్ప విజయాన్ని అందించారని ఉద్దవ్ పేర్కోన్నారు. 

3:15 PM IST:

ఆమ్ ఆద్మీ పార్టీ రాజేందర్ నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించిది. ఆ పార్టీ అభ్యర్థి రాఘవ్ చందా 20,058  ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్దే అతన్న భుజాలపై ఎత్తుకుని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... అరవింద్ కేజ్రీవాల్ దేశ ద్రోహి కాదు నిజమైన దేశభక్తుడని నమ్మారు కాబట్టే మరోసారి అతడికి  పట్టం కట్టారని అన్నారు. బిజెపి చేసేది కాదు కేజ్రీవాల్ చేసేది అసలైన దేశభక్తి. 

2:45 PM IST:

ఉత్కంఠ పోరులో చివరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విజేతగా నిలిచారు. మొదటి నుండి బిజెపి అభ్యర్థి రవీందర్ సింగ్  నేగి గట్టి పోటీ ఇచ్చారు. ఓ దశలో అయితే వరుస రౌండ్లలో సిసోడియా వెనుకబడ్డారు. అయితే  చివర్లో పుంజుకున్న ఆయన 3400 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2:33 PM IST:

'' అద్భుత విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరియు అరవింద్ కేజ్రీవాల్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నా.ఈ ఓటమితో బిజెపి వరుసగా ఐదో రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. అంటే మేం ప్రజలకు దగ్గరవడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యాం.''  అని మోడల్ టౌన్ బిజెపి అభ్యర్థి కపిల్ మిశ్రా అభిప్రాయపడ్డాడు. 

2:21 PM IST:

డిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అర్హత సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల్లో మరోసారి  బంపర్ మెజారిటీ సాధించి  హ్యాట్రిక్ విజయాన్ని అందుకోడానికి సిద్దంగా వున్నారు. ఈ క్రమంలో  భార్య సునీతతో కలిసి పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.  అయితే అవి కేవలం గెలుపు సంబరాలు మాత్రమే కాదు... ఇవాళ కేజ్రీవాల్ భార్య  పుట్టినరోజు. దీంతో ఆమెతో కేక్ కట్ చేయించి రెండు వేడుకలను ఒకేసారి జరుపుకున్నారు కేజ్రీవాల్. 
 
2:18 PM IST:

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. పట్పార్ గంజ్ నుండి పోటీచేస్తున్న ఆయనకు బిజెపి అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో ఇప్పటివరకు వెనుకంజలో వున్న సిసోడియా తాజాగా 656 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. 

2:04 PM IST:

ఈ ఎన్నికల ఫలితం తనకు వ్యతిరేకంగా రావడానికి హిందూ-ముస్లీం ఓట్లు కేంద్రీకృతం అవ్వడమే కారణమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా.  ఈ రెండు వర్గాలు పూర్తిగా కేవలం రెండు  పార్టీలవైపే నిలిచారు. దీంతో తన ఓటమి తప్పలేదని... అయితే ఈ ఓటమిని తాను అంగీకరిస్తున్నానని అన్నారు.  
 
1:54 PM IST:

ఢిల్లీలో వెలువడిన ఎన్నికల  ఫలితాలను ఆమోదిస్తున్నామని బిజెపి ఎంపీ పర్వేశ్ వర్మ తెలిపారు. ఇప్పటికంటే  ఎక్కువ కష్టపడి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత  బలోపేతం చేసి  అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అయితే ఈ ఎన్నికల పలితానికి విద్య మరియు అభివృద్దే కారణమైతే విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఓటమిఅంచుల్లో నిలవడం ఏమిటని  ప్రశ్నించారు.  

1:35 PM IST:

న్యూడిల్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన సీఎం కేజ్రీవాల్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 13,508 ఓట్ల ఆధిక్యంతో బిజెపి అభ్యర్ధి సునీల్ కుమార్ యాదవ్ పై విజయాన్ని అందుకున్నారు. 

1:27 PM IST:

ఓక్లా(షహీన్ బాగ్) నియోజకవర్గంలో రికార్డు విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్  అభ్యర్థి అమానతుల్లా ఖాన్ బిజెపిని విమర్శలు ఎక్కుపెట్టాడు. ఢిల్లీ ప్రజలు బిజెపికి, అమిత్ షాకి కరెంట్ షాక్ లాంటి ఫలితాన్ని ఇచ్చారు.  ఇది అలసత్వంపై అభివృద్ది సాధించిన విజయమని అన్నారు. ఈ రికార్డు విజయం నాది కాదు ఢిల్లీ  ప్రజలదేనని అమానతుల్లాఖాన్ పేర్కొన్నాడు. 
 
1:17 PM IST:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను తాము అంగీకరిస్తున్నామని బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపారు.  విజయం దిశగా సాగుతున్న ఆప్ కు, సీఎం కేజ్రీవాల్ కు, ఢిల్లీ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి శక్తివంన  లేకుండా ప్రతిఒక్క బిజెపి నాయకుడు, కార్యకర్త కష్టపడ్డారు. అయితే ప్రజలకు తమపై నమ్మకాన్ని కలిగించలేకపోయాం. అరవింద్  కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీ మరింత అభివృద్ది చెందుతుందని అనుకుంటున్నట్లు గంభీర్ అభిప్రాయపడ్డారు. 

1:01 PM IST:

డిల్లీ  అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని  ఖాయం చేసుకున్న ఆప్ పార్టీకి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పొలిటికల్ స్ట్రాటేజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అభినందనలు తెలిపారు. ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్ ను స్వయంగా కలిసి ఆ అభినందనలు తెలిపారు. 

12:44 PM IST:

డిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా ఘోర ఓటమిని చవిచూస్తుందని ముందే ఊహించాం. అయితే పెద్ద పెద్ద మాటలు  మాట్లాడే బిజెపి పరిస్థితి ఇంత ఘోరంగా ఓటమిపాలవడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యిందన్నారు. 

12:27 PM IST:

కల్కజి నియోజకవర్గంలో బిజెపి-ఆప్ ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 10వ రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి ధరమ్ వీర్ సింగ్ ఆప్ అభ్యర్థి ఆతిషిపై కేవలం 25 ఓట్ల ఆధిక్యంతో వున్నారు. ధరమ్ వీర్ కు 20266 ఓట్లురాగా ఆతిషికి 20241 ఓట్లు వచ్చాయి. 

12:15 PM IST:

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా  గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే మరింత తగ్గింది. ఈ ఫలితంపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ చోప్రా స్పందిస్తూ తానే దీనికి బాధ్యత వహిస్తానని అన్నారు. అయితే పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రదర్శనపై త్వరలో సమీక్షించుకుని ఈ ఘోర పరాభవం వెనకున్న కారణాలను అన్వేషిస్తామని అన్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను కూడా విశ్లేషించి కారణాలను కనుక్కుంటామని అన్నారు. 

11:56 AM IST:

న్యూఢిల్లి నియోజకవర్గం నుండి ఆప్ తరపున పోటీచేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్  ఇప్పటివరకు 11,308 ఓట్లు  సాధించారు. ఆయన తర్వాత స్థానంలో బిజెపి అభ్యర్ధి సునీల్ కుమార్ యాదవ్ 4909 ఓట్లతో నిలిచాడు. కాంగ్రెస్ అభ్యర్థి రోమేష్ సబర్వాల్ 949  ఓట్లు మాత్రమే పొందాడు. 

11:38 AM IST:

ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 52 శాతం ఓట్ షేర్ సాధించింది.  బిజెపి 39  శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కేవలం 4 శాతం ఓట్ షేర్ ను మాత్రమే సాధించింది. ఆప్-బిజెపిల మధ్య ఓటింగ్ శాతం  పరంగా తేడా తక్కువగానే వున్న సామాన్యుడి పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. 
 
11:18 AM IST:

ఆమ్ ఆద్మీ పార్టీ  అభ్యర్థి, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా భారీ ఓట్ల తేడాతో వెనుకంజలో  వున్నారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి ఆయన బిజెపి అభ్యర్థి రవి నేగి కంటే 1427 ఓట్లు  వెనుకబడి వున్నారు. 

11:10 AM IST:

డిల్లీ అసెంబ్లీ స్పీకర్,  షాహ్ దారా ఆప్ అభ్యర్థి  రామ్ నివాస్ గోయల్ వెనుకంజలో వున్నారు.  

11:05 AM IST:

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నా ఆ పార్టీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెనుకంజలోకి వెళ్లిపోయారు. పత్పార్ గంజ్ నుంచి పోటీచేస్తున్న అతడిపై బిజెపి అభ్యర్థి రవి  నేగి స్వల్ఫ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిసోడియా 4945 ఓట్లతో కొనసాగుతుండగా ప్రత్యర్థి రవి నేగి 4983 ఓట్లతో ఆధిక్యంలో నిలిచాడు. 

10:56 AM IST:

డిల్లీలో ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఆప్, బిజెపిల మధ్యే ప్రదాన పోటీ వుంది. ఇరుపార్టీల మధ్య దాదాపు 27 స్థానాల్లో కేవలం 1000 ఓట్ల అంతరం మాత్రమే వుంది. దీంతో ఎప్పటికప్పుడు ఫలితాల సరళి మారుతోంది. 

10:49 AM IST:

ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి డిల్లీలో అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు కాంగ్రెస్ ఎంపీ అభిరంజన్ చౌదరి.  అయితే కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఓటమిపాలవ్వడం అనేది మంచి సంకేతం కాదు. ఆప్ సాధించిన ఈ విజయం బిజెపి పైనే కాదు ఆ పార్టీ కమ్యూనల్ ఎజెండాపైనే అని అభిరంజన్ పేర్కొన్నారు. 
 
10:40 AM IST:

ఎలక్షన్ కమీషన్ అందించిన అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఆప్ 45, బిజెపి 19 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. 

10:31 AM IST:

చాందినీచౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్ధి పర్లాద్ సింగ్ సాహ్నీ 6043, కాంగ్రెస్ అభ్యర్ధి ఆల్కా లాంబా 157, బిజెపి 67  ఓట్లు సాధించాయి. 

10:24 AM IST:

ఎన్నికల ఫలితాలు వెలువడటం ఇప్పుడే మొదలయ్యాయని... అయితే బిజెపి-ఆప్ ల మధ్య అంతరం వున్నట్లు అర్థమవుతోందన్నారు బిజెపి డిల్లీ అధ్యక్షులు మనోజ్ తివారి. అయితే ఇంకా సమయం వుంది కాబట్టి పూర్తి ఫలితాలు వెలువడేలోపు తాము పుంజుకుంటామని ఆశిస్తున్నా. అయితే ఫలితం ఏదయినా అందుకు పూర్తిగా తానే బాధ్యున్నని తివారి తెలిపారు. 

10:13 AM IST:

పత్పార్ గంజ్ నుండి పోటీచేసిన ఆప్ అభ్యర్ధి, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 112 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే మోడల్ టౌన్ నుండి  పోటీచేసిన బిజెపి అభ్యర్థి కపిల్ మిశ్రా 98 ఓట్ల ఆధిరక్యంలో కొనసాగుతున్నారు. 

10:00 AM IST:

న్యూడిల్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి, సీఎం కేజ్రీవాల్ 2026 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే రోహిణి నియోజకవర్గం నుండి బిజెపి తరపున పోటీలో నిలిచిన విజేందర్ గుప్తా 1172 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

9:56 AM IST:

హరినగర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధ తేజీందర్ పాల్ బగ్గా వెనుకంజలోకి వెళ్లాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి ఆప్ అభ్యర్ధి రాజ్ కుమారి దిల్లాన్ అతడిపై ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 

9:49 AM IST:

గ్రేటర్ కైలాష్ నుండి పోటీ చేస్తున్నఆప్ అభ్యర్ధి సౌరబ్ భరద్వాజ్ ప్రస్తుతం 1505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతు న్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ పాలనను ప్రజలు అంగీకరించారని... అందువల్లే మరోసారి పట్టం కట్టేందుకు సిద్దమయ్యారని అన్నారు. 
 
9:36 AM IST:

డిల్లీ ఎన్నికల  ఫలితాల్లో బిజెపి పార్టీ మెళ్లిగా పుంజుకుంటోంది. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీయే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నా బిజెపి ఆధిక్యం ఒక్కోటిగా పెరుగుతోంది.  ప్రస్తుతం ఆప్ 48 స్థానాల్లో, బిజెపి 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక్కచోట కూడా ఆధిక్యంలో లేదు. 
 
9:19 AM IST:

పటేల్ నగర్ లో మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీర్థ్ వెనుకంజలో వున్నారు. ఆమె ఇటీవలే బిజెపి ని వీడి కాంగ్రెస్ పార్టీలో  చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పటేల్ నగర్ నుండి పోటీకి దిగారు. 

9:09 AM IST:

ఇప్పటివకు ఆధిక్యంలో కొనసాగిన ఏకైక స్థానంలో కూడా కాంగ్రెస్ వెనకంజలోకి వెళ్లిపోయింది. చాందిన్ చౌక్ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్కా లాంబా రెండో స్థానానికి పడిపోయారు.  
 
9:04 AM IST:

డిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద  కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఫలితాల గురించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నట్లు  సమాచారం. 
 
9:00 AM IST:

గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో మంత్రి సౌరబ్ భరద్వాజ్ ముందంజలో వున్నారు. బిజెపి అభ్యర్థిని రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 
 
8:50 AM IST:

డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పట్పార్ గంజ్ నుండి ఆఫ్ అభ్యర్ధిగా పోటీలో వున్న విషయం తెలిసిందే. ఆయన అక్షర్ ధామ్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు  సరళిని పరిశీలిస్తున్నారు. ఇక్కడే బిజెపి అభ్యర్థి రవి నేగి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు.

8:43 AM IST:

డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో వున్నారు. 

8:35 AM IST:

ప్రతాప్ గంజ్ లో ఆప్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా ముందంజలో  ఉన్నారు. అలాగే రోహిణి నియోజకవర్గం లో బీజేపీ నేత విజయేంద్రకుమార్ ముందంజలో వున్నారు. 
 
8:32 AM IST:

ఆప్ ఆధిక్యం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ మెజారిటీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో వుంది. 45 స్థానాల్లో ఆప్, 11 స్థానాల్లో బిజెపి , ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది.  
 
8:28 AM IST:

డిల్లీ కంటోన్మెంట్, ద్వారకా, జనక్ పురి, కృష్ణానగర్ లలో బిజెపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
8:25 AM IST:

చాందిని చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్ధి అల్కా లాంబా ఆప్, బిజెపి అభ్యర్ధులకంటే ప్రస్తుతం ముందంజలో వుంది. 
 
8:17 AM IST:

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్లే డిల్లీలో ఆప్ దూసుకుపోతోంది. ఫలితాల ప్రక్రియ మొదలవగానే ఆప్ 25 స్థానాల్లో ముందంజలోకి వెళ్లిపోయింది. బిజెపి  8, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో  వుంది.

8:13 AM IST:

డిల్లీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయ్యింది. మహారాణి బాగ్ లో అధికారులు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 
   
12:14 PM IST:

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా  గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతం కూడా గతంలో కంటే మరింత తగ్గింది. ఈ ఫలితంపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ చోప్రా స్పందిస్తూ తానే దీనికి బాధ్యత వహిస్తానని అన్నారు. అయితే పార్టీ పరిస్థితి, ఎన్నికల ప్రదర్శనపై త్వరలో సమీక్షించుకుని ఈ ఘోర పరాభవం వెనకున్న కారణాలను అన్వేషిస్తామని అన్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను కూడా విశ్లేషించి కారణాలను కనుక్కుంటామని అన్నారు. 

12:13 PM IST:

12:03 PM IST: