ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2020: దూసుకుపోతున్న ఆప్
న్యూఢిల్లీ అసంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకు పోతోంది. బీజేపీ వెనుకంజలో ఉంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మంగళవారం నాడు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే ఆప్ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. తన సమీప బీజేపీ అభ్యర్థులపై ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఈ నెల 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 64 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం 24 గంటల ఆలస్యంగా ప్రకటించడంపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మంగళవారం నాడు ఉదయం ఢిల్లీలోని 21 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూసుకుపోతున్నట్టుగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే అందుతున్న సమాచారం ప్రకారంగా తెలుస్తోంది. 38 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. 10 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
పోలింగ్ ముగిసిన రోజున వెలువుడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే పలితాల ట్రెండ్ కన్పిస్తోంది. మంగళవారం నాడు మధ్యాహ్నానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.